Logili Books

Personality Development

2 Engels Pustaka Parichayalu

By V Venkatrao

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
2 Engels Pustaka Parichayalu
Author
Publisher
Cheekati Prachuranalu Velugu Kosam
ISBN
MANIMN7213
Binding
Paparback
Published Date
Aug, 2026
Number Of Pages
112
Language
Telugu
Availability
In Stock
About this book

జర్మనీలో రైతు యుద్ధం

మూలం: ఫెడరిక్ ఎంగెల్స్

తెలుగు అనువాదం: రాచమల్లు రామచంద్రా రెడ్డి

1850లో ఎంగెల్స్ ఈ పుస్తకం రాసాడు. ఈ పుస్తకంలో ప్రధానంగా 1525 సంవత్సరంలో జరిగిన రైతుల తిరుగుబాటు. అప్పటికి (ఎంగెల్స్ ఈ పుస్తకం రాసేనాటికి) 325 సంవత్సరాల క్రితం. అంటే, ఇప్పటికి 500 సంవత్సరాల క్రితం అన్నమాట. అయితే, అంతకు ముందు కూడా అనేక తిరుగుబాట్లు జరిగాయి. వాటి గురించిన ప్రస్తావన కూడా ఇందులో వుంది. ఈ పుస్తకంలో మొత్తం 7 చాప్టర్లు వున్నాయి. కాల క్రమంలో చెప్పాలంటే, 3, 4 చాప్టర్లలో, మొదటి కాలం ప్రస్తావన వస్తుంది. 1525 కన్నా ముందు జరిగిన తిరుగుబాట్ల గురించిన వివరాలు అందులో వున్నాయి. అలా చూస్తే 3, 4, 1, 2, 5, 6, 7, చాప్టర్లు చదవాలి. కానీ, నేను పుస్తకంలో ఎలా ఉంటే, అలాగే పరిచయం చేస్తున్నాను. వీలయినంత సరళంగా, క్లుప్తంగా చెప్పాలనే ప్రయత్నించాను. 1525 నాటి తిరుగుబాటును “జర్మనీ చరిత్రలో అత్యంత మౌలికమైన ఘటన" అని మార్పు 1844లో వర్ణించాడు. ఈ పుస్తకం నిండా అధిక మైన పన్నుల భారం భరించలేక తిరగబడిన రైతుల ఆర్తనాదాలూ, ఫలితంగా కొరడాదెబ్బలూ, తెగిపడిన శరీర భాగాలూ, శిరఃచేధాలూ, అడుగడుగునా వీరోచిత పోరాటాలూ, ప్రతి పేజీలోనూ రక్తపు మరకలు. ఇవే.....

జర్మనీ అనగానే ఈనాటి యూరప్ ఖండంలో జర్మనీని వూహించుకోకూడదు. అందమైన రోడ్లూ, ఎత్తయిన భవనాలూ, ఆధునిక వసతులతో కూడిన రెస్టారెంట్లూ ఇవి కావు. 1525 నాటికి జర్మనీ ఎలా ఉండేది? అనేక చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉండేది. ప్రష్యా, ఆస్ట్రియా, స్వాంబియా.... ఇలా మరి కొన్ని కలపి ఒకే కూటమిగా ఉండేవి. దాన్ని “జర్మనీ కన్ఫడరేషన్" అనేవారు. అంటే, ఒక పెద్ద రాజ్యం. దానికి ఇతర రాజ్యాలు అన్నీ చిన్నవి. (సామంత రాజ్యాలు) ఆ పెద్ద రాజ్యం అధీనంలో లేదా పరిపాలనలో చిన్న రాజ్యాలు ఉంటాయి. ఈ అధీనంలో ఉండడానికి కారణం. సైనిక బలం, ఆయుధబలం ఇలాంటివే. "రాజ్యం వీర భోజ్యం" అంటారే అలాగ. మరి చిన్న రాజ్యాల అధీనంలో మరి కాస్త పెద్ద భూస్వాములూ, జమిందారులూ.........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?