Logili Books

Cinema

Abhinaya Sodarimanulu ( Navarasabhinaya Nayikalu Shavukaaru Janaki, Krishna kumari)

By Vaitla Kishore Kumar

₹350
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Abhinaya Sodarimanulu ( Navarasabhinaya Nayikalu Shavukaaru Janaki, Krishna kumari)
Publisher
Sri Lalita Shiva Jyothi Prachuranalu
ISBN
MANIMN6681
Binding
paparback
Published Date
2025
Number Of Pages
70
Language
Telugu
Availability
In Stock
About this book

అభినయ మంజరి - కృష్ణ కుమారి

మలయ సమీరుడు మనసై మలచిన

మధుమయ శిల్పం, రాగజగతికే రక్తిని పిలిచె రసమయ రూపం. శ్రీనాధ కవినాధ శృంగార కవితా ప్రబంధాల కావ్యనాయిక, అమర గానాల అపురూప అభినయ వేదిక, నవ్య కళారూపాల చిత్ర జగత్తున వెలిసిన నవరస నటమంజరి, అభినయఝురి కృష్ణ కుమారి.

అప్పుడే పుష్పించి వికశిస్తున్న తెలుగు సినీ పారిజాతవనంలో తళుక్కున మెరిసిందొక బంగార పాప అభినయ తరంగాల అమర నాట్యాల తెలియాడించిన భువనసుందరి,రసిక కళాహృదయాలను రసవంతం చేసిన రసమయ నాయికి. సినీ సామ్రాజ్య సింహాసనంలో యువరాణిగా తిరుగులేని అధిపత్యాన్ని ప్రదర్శించిన రాజు కుమారి, మహిళాలోకపు మనస్సులలో సాత్వికాభినయ సౌశీల్యవతిగా, సతీమతల్లిగా ముద్రవేసుకున్న సతీ తులసి. ఆమె రెండు దశాబ్దాలపాటు వెండితెపై కథానాయకిగా, కావ్యనాయకిగా వెలుగొందిన అభినయ మంజరి కృష్ణ కుమారి.

అమర శిల్పులు మనసుపెట్టి మలచిన సువర్ణశిల్పంలా ఉండే సౌందర్యం, కళ్ళతోనే కోటి భావాలు పలికించగల నేర్పరితనం, చిరునవ్వుల వెన్నెలతో యువ హృదయాలలో మరుమల్లెలు పూయించే రూపసౌందర్యం. ఏ పాత్రనైనా సునాయాసంగా అభినయించగల చాతుర్యం కృష్ణకుమారి సొంతం. అందుకే ఆమె రెండు దశాబ్దాలు తిరుగులేని కథానాయికగా వెండితెర పై వెలుగొందారు. తెలుగు సినిమా స్వర్ణయుగం నుండి వర్ణయుగం వరకు ఆమె అభినయ సౌరభాలు సినీపారిజాత వనంలో పరిమళించాయి.....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?