Logili Books

Religion

Adhyatmika Satyalu

By Prof Turaka Nirmala Mary

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Adhyatmika Satyalu
Publisher
acharya nagarjuna university, Guntur
ISBN
MANIMN7041
Binding
Paparback
Published Date
Oct, 2025
Number Of Pages
103
Language
Telugu
Availability
In Stock
About this book

ఉపోద్ఘాతము

పరిశుద్ధ బైబిలు గ్రంథము మానవాళికి దేవుడు అనుగ్రహించిన దివ్య సందేశము. ఈ సందేశము యేసుక్రీస్తు ద్వారా సంపూర్తి గావించబడినది. మానవుని రక్షణ ప్రణాళికను గురించి బైబిలు ఉద్ఘాటిస్తుంది. మానవ మనుగడకు బైబిలు ఆధారమని అందులో వ్రాయబడిన ప్రతి అంశాలను అధ్యయనము చేయుట ద్వారా ధన్యకరమైన

జీవితయాత్ర కొనసాగించగలం. బైబిలునందలి లేఖనములు సత్యమైనవి. జ్ఞానము అభ్యసించుటకు చదువవలెను. రక్షించబడుటకు నమ్మాలి, పరిశుద్ధముగా జీవించుటకు అభ్యాసం చేయాలి.

నాకు కలిగిన ఆత్మీయ జ్ఞానముతో "ఆధ్యాత్మిక సత్యాలు" అను నా తొమ్మిదవ పుస్తకమును పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆరంభించి తొమ్మిది అధ్యాయాలతో సంపూర్తి చేయగలిగాను. త్రియేక దేవునికే నా కృతజ్ఞతలు. మొదటి అధ్యాయము 'క్రీస్తే నా గురి' లో క్రైస్తవ దైవజ్ఞానమునకు కేంద్రము యేసుక్రీస్తు ప్రభువు గావున క్రీస్తును గూర్చిన విషయాలు ‘యేసువైపు చూచుట', 'యేసు వద్ద నేర్చుకొనుట', 'యేసుపై ఆనుకొనుట', ‘యేసుకొరకు కనిపెట్టుట', 'యేసుమాటలు విని విశ్వసించుట', 'యేసు చిత్తమును అంగీకరించుట’, ‘యేసుక్రీస్తులో జీవించుట' అను అంశాలను క్రోడీకరించాను. రెండవ అధ్యాయమైన 'పరమకుమ్మరి రూపకల్పన' లో దేవా నీ హస్తములో ఒక పాత్రగా నేను రూపింపబడితిని. నా జీవిత ప్రయాణం నీ ఈ చక్రంపై నున్నది. నీవు ఆశించిన నా పాత్ర ప్రయోజనకరమైనదిగా చేయమని బైబిలు నందలి వ్యాఖ్యానాల ద్వారా విశదపరచితిని. మూడవ అధ్యాయములో దేవుని ఏ రీతిగా ఘనపరచవలెనో, నాల్గవ అధ్యాయములో ధర్మశాస్త్రవిధి సిలువలో, నెరవేర్చబడినది. పాపము, ధర్మశాస్త్రము, కృప, క్రయధనములను గూర్చి వివరించబడినవి. అయిదవ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు - బాల్యము - క్రీస్తును గూర్చిన బోధలు విపులీకరించబడినవి. ఆరవ అధ్యాయములో త్రిత్వములోని దైవ వ్యక్తియైన పరిశుద్ధాత్మను గూర్చిన లేఖనసత్యాలు, పరిశుద్ధాత్మ గుర్తులు, వరాలను గూర్చి పేర్కొనబడినవి. ఏడవ అధ్యాయములో యేసుక్రీస్తు వారు ఉత్తమ బోధకుడు, ఉపాధ్యాయుడుగానే ఉపమానముల ద్వారానే పరలోక రాజ్య మర్మములు బోధించెను గావున కొన్ని ఉపమానముల మర్మములు తెలుపబడినవి. ఎనిమిదవ అధ్యాయము యేసుక్రీస్తు పునరుత్థాన ప్రత్యేకతలు సర్వమానవాళి గుర్తెరుగవలసిన సత్యము. యేసుక్రీస్తు దైవత్వం, ఆయన మరణ పునరుత్థానాలపైనే సువార్త ఆధారపడియున్నది. ప్రథమ...........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?