Logili Books

Novels

Ahimsa Jyothi

By Kodavatiganti Kutumbarao

₹160
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Ahimsa Jyothi
Publisher
Bala Books Publications
ISBN
MANIMN7051
Binding
Paparback
Published Date
2025
Number Of Pages
111
Language
Telugu
Availability
In Stock
About this book

సుమారు రెండున్నరవేల సంవత్సరాల క్రితం భారతదేశంలో పదహారు పెద్ద రాజ్యాలూ, అనేక చిల్లర రాజ్యాలూ ఉండేవి, కొన్ని గణతంత్ర రాజ్యాలు కూడా ఉండేవి. పెద్ద రాజ్యాలలో ప్రధానమైనవి కోసల, మగధ, విదేహ రాజ్యాలు. లిచ్ఛవులూ, శాక్యులూ గణతంత్ర రాజ్యాలు ఏర్పరచుకున్నారు. శాక్యుల రాజ్యం హిమాలయాలకు దిగువగా, సుమారు వెయ్యి చదరపు మైళ్లు విస్తీర్ణం కలిగి ఉండేది. శాక్యులు కోసలరాజులకు సామంతులు. కపిలవస్తునగరం వారి రాజధాని, శాక్యుల దేశం చాలా అందమైనది, సారవంతమైనది. దీనికి ఉత్తరాన హిమాలయాల మంచు కొండలుండేవి. దేశమంతటా అందమైన సాలవృక్షాలూ, ఇతర వృక్షాలూ ఉండేవి. మైదానాలలో వరి పుష్కలంగా పండేది.

శాక్యులు క్షత్రియులు. వారికి శుద్ధోదనుడు రాజు, శాక్యులు కోసలరాజు కింద సామంతులే అయినప్పటికీ, ఎక్కువ అభిమానం కలవారు; ఒకరికి సులువుగా తల ఒగ్గేవారు కారు. ఒకప్పుడు ఒక కోసలరాజు తనకు భార్యగా ఉండటానికి ఒక శాక్య కన్యను పంపమని కబురు చేస్తే శాక్యులంతా కూడ బలుక్కుని, తమ కన్యలను వివాహమాడటానికి కోసల రాజులు అర్హులు కారని తీర్మానించి, ఒక బానిస పిల్లను పంపారు! ఇందుమూలంగా కోసలరాజు కపిలవస్తును బుద్ధుడి కాలంలోనే కొల్లగొట్టటం జరిగింది. శాక్యులు ఆలాంటి అభిమానధనులు. శాక్యరాజైన శుద్ధోదనుడి పట్టమహిషి మహామాయ, లేక మాయాదేవి. ఆయన రెండవ భార్య మహాప్రజావతి, వీరిద్దరూ వ్యాఘ్రపురరాజు కుమార్తెలు.

వీరి గర్భాన ఒక చక్రవర్తి, ఒక అవతార పురుషుడూ జన్మిస్తారని జ్యోతిష్కులు చెప్పటం చేత జంబూద్వీపంలోని అనేక రాజులు వారిని పెళ్లాడగోరారు. కాని వారి తండ్రి వారిని శాక్యరాజైన శుద్ధోదనుడికిచ్చి వైభవంగా వివాహం చేశాడు..................................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?