Logili Books

Novels

Ame O Spurthi Gaadha

By Vrindaa Rajani Reddy K

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Ame O Spurthi Gaadha
Publisher
Akshata Publications
ISBN
MANIMN7022
Binding
Paparback
Published Date
2026
Number Of Pages
113
Language
Telugu
Availability
In Stock
About this book

అసలు ఒక కథ రాయాలంటే ఏమి కావాలి?

పాత్రలా...? ఉద్వేగాలా...? లేదంటే పాత్రల ఉద్వేగాలా...? ఇలాంటి ప్రశ్నల నడుమే నా కథా ప్రయాణం ఆరంభమైంది.

మొదట నేను పాత్రలను సృష్టిస్తున్నాననుకున్నాను. కానీ కొంత దూరం నడిచాక అర్థమైంది... నేను వాటిని రాయడం కాదు, ఆ పాత్రలే నన్ను నడిపిస్తున్నాయని.

సింధు ప్రేమలోని వేదనను అనుభవించాను...అరుణ స్నేహంలో ఆప్యాయతను అందుకున్నాను... సీతామలక్ష్మి బాధలకు నా కన్నీళ్లను అరువిచ్చాను... రాజా మంచితనానికి ముగ్ధురాలినయ్యాను...శ్రీరాం నిశ్శబ్ద ప్రేమతో కలిసి నడిచాను...

ఎనిమిది నెలల ఈ అక్షరయాత్రలో, ప్రతి పాత్ర నా మనస్సులో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రతి అధ్యాయం రాస్తున్నప్పుడు వారి ఆనందాల్లో నవ్వాను, వారి బాధల్లో తడిసిపోయాను.

మనుషుల ఆలోచనలు వేర్వేరుగా ఉండొచ్చు. కానీ ప్రేమించే హృదయం మాత్రం ఎప్పుడూ ఒకటే. ఆ ప్రేమకు సింధు ఒక రూపమైతే, త్యాగానికి సీతామలక్ష్మి మరో రూపం. స్నేహానికి హద్దులు ఉండవని అరుణ చెబితే, నిజమైన ప్రేమ అంటే కేవలం పొందడం కాదు, అవసరమైతే విడిచిపెట్టడం కూడా అని ఈ కథ మనకు గుర్తుచేస్తుంది.

ఇది కేవలం ప్రేమకథ కాదు...

ఎదురుచూసే ఒక హృదయపు నిరీక్షణ...బాధల మధ్య బంధాలను కాపాడుకునే మనస్సు...ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా ప్రేమను మోసుకెళ్లిన ఒక అమ్మాయి జీవితగాథ.

ఈ కథలో మీకు కనిపించేవి కేవలం పాత్రలు మాత్రమే కావు. మన చుట్టూ ఉన్న మనుషులు, మన జీవితంలో ఎప్పుడో తారసపడిన అనుబంధాలు, మనస్సు మరిచిపోలేని జ్ఞాపకాలు కూడా.

కొన్ని కథలు చదివాక మర్చిపోతాం... కొన్ని కథలు చదువుతున్నంతసేపే మనతో ఉంటాయి...కానీ మరికొన్ని కథలు మాత్రం మన జీవితంలో ఎప్పుడో అనుభవించిన భావాల్లా మనస్సులో శాశ్వతంగా నిలిచిపోతాయి.

‘ఆమె.. ఓ స్ఫూర్తి గాధ..!!' కూడా అలాంటి ఒక భావోద్వేగ ప్రయాణమే.

ఈ అక్షరాల ప్రయాణంలో ఎక్కడో ఒక చోట మీ నవ్వు ఉంటుంది...మీ బాధ..........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?