• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Ammaku Abhi Vandanam

Ammaku Abhi Vandanam By Simhaprasad

₹ 150

అమ్మకు అభివందనం

ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు కొందరు ఆడిటోరియంలో సమావేశమయ్యారు.

పేర్లు ఇచ్చిన వారంతా వచ్చారో లేదో చెక్ చేసుకుంది ఆరవి. ఆమె కాలేజ్ కల్చరల్ సెక్రటరీగా ఈ ఏడాదే ఎన్నికైంది. అంచేత అన్ని ఈవెంట్సులో పాల్గొనాలనీ, తమ కాలేజీ పేరు మార్మోగించాలనీ చాలా త్సాహంగా పట్టుదలగా ఉంది.

లైబ్రేరియన్ మంజూష రాగా లేచి విష్ చేశారంతా. ఆవిడకి నలభై ఏళ్ళుంటాయి. చక్కగా ఉంటుంది. ఎంచక్కా మాట్లాడుతుంది. ఆమెకి నాట్యమూ, నాటకాలూ ఇష్టం. అందుకని విద్యార్థులంతా ఆమెతో కలుపుగోలుగా ఉంటారు. కాలేజీలో జరిగే ప్రతి ఫంక్షన్ వెనుకా ఆమె ఉండి తీరుతుంది.

ఇంటర్ కాలేజ్ డ్రామా కాంపిటేషన్ ప్రకటించగానే ఆర్నవి వెళ్ళి ఆమెని కలిసింది. "మనమూ పార్టిసిపేట్ చేద్దాం మేడమ్. ఎలాగైనా కప్పు కొట్టుకు రావాలి. మీరే గైడ్ చేయాలి" అని కోరింది.

దాని ఫలితమే ప్రస్తుత సమావేశం.

"ఏం నాటకం వేయిస్తున్నారు మేడమ్" సుధీర్ అడిగాడు. "మంజీరనాదం. నేనే రాశాను. ఇంతవరకూ ప్రదర్శించే అవకాశం.................

  • Title :Ammaku Abhi Vandanam
  • Author :Simhaprasad
  • Publisher :Tapaswi Manoharam Publications
  • ISBN :MANIMN6327
  • Binding :Papar Back
  • Published Date :June, 2025
  • Number Of Pages :160
  • Language :Telugu
  • Availability :instock