Logili Books

Novels

Apurva Vihangam Katha Samputi

By Krishna

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Apurva Vihangam Katha Samputi
Author
Publisher
Rukmini Publications
ISBN
MANIMN7068
Binding
Paparback
Published Date
2010
Number Of Pages
229
Language
Telugu
Availability
In Stock
About this book

లోకవరం

నేను రెండు గదుల ఇల్లు అద్దెకు తీసుకుని వంటరిగానే ఉండసాగాను. రోజూ వంట పనీ అదీ చేయడానికి ఒక మనిషిని కుదిరించి పెట్టారు మా ఆఫీసు సిబ్బంది.

ఏం చేస్తాం! కొత్తగా కట్టుకున్న ఇంటిని వదిలి - 'ఎప్పుడో కట్టుకున్న' నాతో బాటు లోకవరం వచ్చెయ్యడానికి శ్రీమతి ఒప్పుకోలేదు. కొత్త ఇంటిని ఇద్దరమూ వదిలేసి వెళ్ళడం నాకూ ఇష్టమనిపించలేదు. అనుకోకుండా మా బావమరిదికి అక్కడికి బదిలీ కావడంతో ఆమె క్కూడా వంటరిగా ఉండాల్సిన అవసరమూ కలుగలేదు.

లోకవరంలో ఒక క్లబ్బుంది. ఉద్యోగస్తులు, ఊరి పెద్దలూ వస్తుంటారు. టెన్నిస్ కోర్టూ, బిలియర్డ్స్ టేబుల్ టెన్సిస్ వగైరా వగైరా లున్నయ్. అధికారులు అధికారేతర ప్రముఖులు క్లబ్బులో కలుసుకోవడం, పరామర్శించుకోవడం జరుగుతూంటుంది.

ఆ సాయంత్రం క్లబ్బుకి వెళ్ళగానే ఓ వార్త తెలిసింది. హైదరాబాదు పొలిమేర్లలో స్థానిక బీడీవోగారి జీపు ప్రమాదానికి గురైందట. జీపులో ఉన్న బీడీవో గారికి తీవ్రమైన గాయాలు తగిలాయి. ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారుట.

నివ్వెరపాటుతో చెబుతూన్న ఆ సభ్యుడికి సానుభూతిగా తలూపేను.

ప్రమాదం వార్త ఫోనుమీద వినగానే మోటార్ సైకిల్పై హైదరాబాదు వెళ్ళిన వ్యక్తి రాకకై ఎదురుచూస్తూ కూర్చున్నాం అందరం.

మరో రెండు గంటల్లో ఆ వ్యక్తి రానే వచ్చాడు సరాసరి క్లబ్బుకే. వాహనాన్ని నిలిపి గంభీరంగా వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.

అంతా చుట్టుముట్టే రతన్ని "ఎట్లా ఉంది బీడీవో సాణి ్క? "ఎట్లా ఉంది?" అంటూ వాకబు చేస్తూ.

గంభీరంగా చూస్తూ తల అడ్డంగా తిప్పేడతను నెమ్మదిగా కొంచెంసేపటికి నిట్టూర్చి. -"ఏమీ చెప్పడానికి వీల్లేదు. ఎమర్జెన్సీ వార్డులో పెట్టారు. ఎవర్నీ లోనికి రానివ్వడం లేదు "

"అసలు గాయాలు ఎక్కడెక్కడ తగిలినయ్?"

అతను అదే ధోరణిలో అన్నాడు - "మెదడుకి దెబ్బ తగిలిందంటున్నారు. రొమ్ము మీద దెబ్బ తగిలిందంటున్నారు - గుండె కేమైనా తగిలిందేమో అంటున్నారు." "గుండెకా? గుండెకి తగిలే?" ఆర్థ్రోక్తిగా ఆగిపోయారొకరు.

'పపూర్ చాప్!' అనుకున్నాను.

"ఎట్లా? ఎట్లా? ఎవరు చెప్పారు?" అడిగాడొక పురప్రముఖుడు....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?