Logili Books

General History

Brahamanavadampai Ambedkar Tirugubatu

By Dr Kathi Padhmarao

₹300
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Brahamanavadampai Ambedkar Tirugubatu
Publisher
Lokayatha Prachuranalu
ISBN
MANIMN2672
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
338
Language
Telugu
Availability
In Stock
About this book

                      డా||కత్తి పద్మారావు గారు భారదతదేశంలో అంబేడ్కర్ మీద రచనలు చేయడంలో ప్రామాణికమైన మేధావి, ఆయన ఇప్పటికి అంబేడ్కర్ మీద "సాంఘిక విప్లవమూర్తి - డా॥బి.ఆర్. అంబేడ్కర్", "అంబేడ్కర్ - గాంధీ", "అంబేడ్కర్ - తత్వశాస్త్రం - దృక్పథం", "అంబేడ్కర్ - బుద్దుడు", "అంబేడ్కర్ - లోహియా”, “భారత రాజకీయాలు - అంబేడ్కర్" వంటి ఎన్నో పరిశోధనా గ్రంథాలు రచించారు. ఈ క్రమంలో వస్తున్న సిద్ధాంత గ్రంథమిది. డా॥ బి. ఆర్. అంబేడ్కర్ బ్రాహ్మణవాదం మీద తిరుగులేని పోరాటం చేశారు. బ్రాహ్మణులు రాసిన అన్ని గ్రంథాలు వేదాలు, దర్శనాలు, స్మృతులు, పురాణాలు అన్నీ అధ్యయనం చేసి వాటికి ప్రత్యామ్నాయ వాజ్మయ సృష్టి చేశారు. ఆ తిరుగుబాటు తత్త్వం, ఆ తిరుగుబాటు జ్ఞానం ఈనాటి ప్రతి దళిత బహుజన

                       మైనారిటీలకు, స్త్రీలకు అవసరం. ఆయన సిద్ధాంతాలు భారతదేశాన్ని పునర్నిర్మిస్తున్నాయి. ఈ గ్రంథంలో డా|| కత్తి పద్మారావు గారు అత్యంత లోతుగా మనకు ఆయన సిద్ధాంతాలు అందించారు. డా|| బి.ఆర్. అంబేడ్కర్ రచనలు, ప్రసంగాలు, జీవితం, వ్యక్తిత్వం, తాత్త్వికత, నైతికత, ఆధునికత, అభ్యుదయం, పోరాటస్ఫూర్తి ఈ గ్రంథంలో మనకు వెల్లివిరుస్తాయి. సరళమైన భాషలో రచించిన ఈ గ్రంథం పాఠకుల హృదయంలోకి, మెదడులోకి చొచ్చుకుపోతుంది. ఈ గ్రంథంలో అంబేడ్కర్ సూక్తులు మన మెదడును మేల్కొలుపుతాయి. అంబేడ్కర్‌తో పాటు మరికొందరు సామాజిక వైతాళికులను కూడా ఈ గ్రంథంలో విశ్లేషించడం జరిగింది. ఉపన్యాసకులకు, సిద్ధాంత కర్తలకు, నాయకులకు, కార్యకర్తలకు, ఈ గ్రంథం కరదీపిక అవుతుంది. ఈ గ్రంథంలో అంబేడ్కర్ చిత్రాలు మనకు స్పూర్తినిస్తాయి. ఇది మహాకవి డా|| కత్తి పద్మారావు గారి 75వ గ్రంథం. లోకాయత ప్రచురణలు ప్రచురించిన అన్ని గ్రంథాలను పాఠకలోకం తమ వెలుగు దివ్వెలు'గా స్వీకరిస్తుంది. ఈ గ్రంథంలో శైలి, భాషణ, రచనా నిర్మాణ దక్షత, అభివ్యక్తి ప్రావీణ్యత పాఠకులను తప్పక ఉత్తేజపరుస్తాయి. మహాకవి డా|| కత్తి పద్మారావు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వై.ఎస్.ఆర్. లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు (జీవిత సాఫల్య పురస్కారం) ఇచ్చిన సందర్భముగా వస్తున్న గ్రంథమిది. భావజాల యుద్ధానికి ఆయుధం ఈ గ్రంథం.

                                                                                                                              - లోకాయత ప్రచురణలు

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?