• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Gassal
₹ 130

ఎంపికలో, నిర్వహణలో రాణించిన కథలు
 

ప్రసిద్ధ రచయిత్రి

కవిగా ప్రసిద్ధుడైన ఆనందాచారి గారు ఇప్పుడు కథకుడుగా తెలుగు సాహిత్యంలో తన ముద్ర వేస్తున్నాడు. “గస్సాల్” కథా సంపుటి ద్వారా ఈ సంపుటిలో కథలు వివిధ పత్రికలలో సాహిత్యాభిమానులు చదివే ఉంటారు. 'కథ బాగుంది', 'మంచి వస్తువు', 'బాగా రాశాడీ రచయిత' వంటి మాటలను తమ మనసుల్లో అనుకునే ఉంటారు. కాని ఒక సంపుటిగా ప్రచురించినపుడు ఆ కథలకూ, కథకుడికి ఒక ప్రత్యేక స్థానం దొరుకుతుంది. రచయిత గురించి ఒక అంచనాకు రావటానికి పాఠకులకూ వీలు కలుగుతుంది. అందువలన గస్సాల్, మరికొన్ని కథల సంపుటిని సాహిత్యాభిమానులంతా ఆహ్వానిస్తారు.

వస్తువు ఎంపిక, కథా నిర్వహణ, ముగింపు ఇవి రచయిత శక్తి సామర్థ్యాలనూ, రచయిత సామాజిక, రాజకీయ అభిప్రాయాలను తెలియజేస్తాయి. కథా వస్తువుని ఎంచుకోవటం తేలిక కాదు. మన కళ్ళముందు నడుస్తున్న జీవితాలు, వాటిలో మార్పులు అందరూ చూస్తారు. ఆలోచిస్తారు. ఆ అనేకానేక సంఘటనల నుంచి ఒక కొత్త వస్తువును ఎంచుకోవటంలో రచయిత ప్రతిభ కనపడుతుంది. ఆ ప్రతిభ ఆనందాచారికి పుష్కలంగా ఉందని ఈ సంపుటిలోని చాలా కథలు మనకు చెబుతాయి. “గస్సాల్", "లచ్చిమి”, "ఆకాశం మారలేదృశ్యమూ మారలే", "ప్రతిస్పందన", "బతుకు బురఖా”, “ఆచూకీ "లేని హత్య", "గూడు", "హిందూ సితా హమారా ఈ కథలలో విషయం - ఎంచుకోవటం వల్ల రచయిత దృక్పథం, ఎటువైపు, ఎవరివైపు ఉన్నాడు, ఎవరి కోసం -ఇతివృత్తం రాస్తున్నాడు. ఏ మార్పును కోరుకుంటున్నాడనేది స్పష్టమవుతుంది..................

  • Title :Gassal
  • Author :Katukojwala Anandachari
  • Publisher :Telangana Sahity
  • ISBN :MANIMN6265
  • Binding :Papar Back
  • Published Date :Feb, 2025
  • Number Of Pages :136
  • Language :Telugu
  • Availability :instock