Logili Books

Novels

Geethanjali

By Dr P Krishnaiah

₹120
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Geethanjali
Publisher
Emasco Books pvt.L.td.
ISBN
MANIMN7067
Binding
Paparback
Published Date
June, 2026
Number Of Pages
145
Language
Telugu
Availability
In Stock
About this book

ప్రేరణ - ప్రయత్నం - ప్రోత్సాహం - ప్రపత్తి

ఒక్కోసారి ఏదైనా పని ఎందుకు ఎప్పుడు ఎలా ప్రారంభమవుతుందో స్పష్టమైన, నిర్దిష్టమైన కారణం ఉండకపోవచ్చు. కొన్ని ప్రయత్నాలు, కార్యాలు యాదృచ్ఛికంగా జరగవచ్చు. అటువంటిదే నా ఈ 'గీతాంజలి' అనువాద ప్రక్రియ. యథాలాపంగా బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం గురించి ఒక పత్రికలో వచ్చిన వ్యాసం చదువుతున్నప్పుడు రవీంద్రుని రచనల సారాంశం తెలిసింది. ఆయన కవిత్వం ఎంతో సున్నితమైనదని, అందమైనదని, గంభీరమైన ఊహలతోను, ఆలోచనలతో నిండి ఉందని నోబెల్ కమిటీ పేర్కొన్నట్లు తెలుసుకున్నాను. ఆనాటికి నోబెల్ బహుమతి పొందిన తొలి ఆసియా కవి ఆయన కావడం, మన భారతీయుడు కావటం సహజంగానే 'గీతాంజలి' పట్ల నాకు మరింత ఆసక్తిని కలిగించింది.

దీంతో నేను 'గీతాంజలి' పుస్తకాన్ని పూర్తిగా చదవాలని అనిపించింది. అంతకుముందు 'గీతాంజలి'లోని కొన్ని కవితలను మాత్రమే అక్కడక్కడ సందర్భానుసారంగా చదివి ఉంటిని. కానీ ఈసారి ముందుగా ఆంగ్లంలో వున్న 'గీతాంజలి'ని ఒకటికి రెండు సార్లు చదివి దాని లోతైన తాత్విక భావాలను అర్ధంచేసుకోవడానికి ప్రయత్నం చేశాను. కొంత కష్టతరమైన పురాతన భాషతో పాటు సుదీర్ఘమైన రవీంద్రుని వాక్య నిర్మాణం అన్వయం చేసుకోవడంలో బాగా ఇబ్బంది కలిగింది. అంతే కాకుండా, ఠాగూర్ గారి ఊహాశక్తి, వారి భావప్రపంచాన్ని పూర్తిగా అర్థంచేసుకోవడం కష్టంగా అనిపించింది.

కనుక 'గీతాంజలి' తెలుగు అనువాదాల కోసం వెతికాను. సుమారు ఇరవై మంది రచయితలు 'గీతాంజలి'ని తెలుగులో ఇంతకూ ముందు అనువదించినట్లు తెలిసింది. వాటిలో కొన్ని తెలుగు అనువాదాలను పరిశీలించాను. అవి నాకు 'గీతాంజలి'లోని భావాన్ని, తాత్వికతను అర్థం చేసుకొనుటకు కొంత సహాయపడ్డాయి. ఇంతకు ముందు తెలుగులోకి.....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?