Logili Books

Personality Development

Grandhalaya Vignanam

By Penugonda Lakshmi Narayana

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Grandhalaya Vignanam
Publisher
Andhra Pradesh Grandhalaya Punarvikasa Udyama Vedyka, Vijayawada
ISBN
MANIMN6326
Binding
Papar Back
Published Date
April, 2025
Number Of Pages
160
Language
Telugu
Availability
In Stock
About this book

తొలినాటి గ్రంథాలయాలు

శరచ్చంద్రజ్యోతి శ్రీ

మెసపుటోమియా, ఈజిప్టు, చైనాలోని హ్వాంగ్ూ నాగరికతల కాలానికి చెందినది లేదా అంతకంటే ముందుదిగా భావిస్తున్న సింధులోయ నాగరికత అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. గొప్ప పట్టణ నాగరికతను నిర్మించింది. భాష, లిపులను రూపొందించుకొంది. దూరదేశాలతో వ్యాపార సంబంధాలను పెట్టుకొంది. అయితే భారతదేశంలో పుస్తక రచన, ప్రచురణలు, గ్రంథాలయాల ఏర్పాటు యూరపు దేశాలకంటే చాల ఆలస్యంగా ప్రారంభం అయింది. కారణం సింధులోయ నాగరికత అంత్యదశలోనో పూర్తిగా ధ్వంసం అయ్యాకనో భారతదేశానికి వచ్చిన ఆర్యులు గ్రామీణ నాగరికతవైపు మళ్ళారు. అప్పటికే ఉన్న భాష, లిపులను స్వీకరించలేదు. గ్రంథ రచనను నిరాకరించారు. ఆర్యులు క్రీ.పూ. 1500-1000 మధ్యకాలాన వేదాల కూర్పు జరిగినప్పటికీ అవి లిఖితరూపును సంతరించుకోలేదు. మౌఖికంగానే ఉండిపోయాయి. ప్రాకృత దేశీ లిపులు ఉన్నప్పటికీ ఆర్యులు వాటి జోలికి వెళ్ళలేదు. ఎటొచ్చీ బౌద్ధమతం వ్యాప్తిలోనే లిపి వాడకం, గ్రంథరచనలు ప్రారంభం అయ్యాయి. పత్తితో కాగితం తయారీ నిపుణత ఉన్నప్పటికీ, భూర్జ, తాళపత్రాల వాడకం తెలిసినప్పటికీ గ్రంథ రచనలు మందకొడిగానే సాగాయి. ఈ నేపథ్యంలో గ్రంథాలయాల స్థాపన అనే ఆలోచనకే ఆస్కారం లేదు. యూరప్ దేశాలలో గ్రంథ రచనలు సాగాయి. గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. వాటి గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం.

యూరపులో ...

క్రీ.పూ. 4వ శతాబ్దంలో ఈజిప్టు 19వ రాజవంశానికి చెందిన రామేశన్ అనే రాజుకు గొప్ప గ్రంథాలయం ఉండేదని చరిత్రకారులు పేర్కొన్నారు. క్రీ.పూ. 5వ శతాబ్దం మధ్యలో ఎథీనియన్లు ఈజిప్టును జయించారు. ఈ సందర్భంగా వారికి దేవాలయాలలో, రాజుల సమాధులలో 36వేల గ్రంథాలు లభించాయట. శత్రురాజులు................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?