Logili Books

General

Jantu Sastram

By Vuppala Lakshmanrao

₹400
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Jantu Sastram
Publisher
Vishalandra Publications
ISBN
MANIMN6653
Binding
Papar Back
Published Date
Oct, 2025
Number Of Pages
393
Language
Telugu
Availability
In Stock
About this book

జంతుజాతిలో రూపవైవిధ్యం

వృక్షశాస్త్రం ఏ విధంగా చెట్టుచేమలను గురించి బోధించుతుందో ఆ విధంగా జంతుశాస్త్రం జంతువులను గురించి బోధించుతుంది.

శీతల ధ్రువ ప్రదేశాలనుండి అత్యధిక ఉష్ణమండలాలవరకూ, మహాసముద్రాల అగాధాలనుండి పర్వత శిఖరాలవరకూ, ప్రపంచమంతటా మనకు జంతువులు కనబడ తాయి. జంతువుల పరిసరాలు, అనగా ప్రకృతిసిద్ధంగా వాటి చుట్టూ వుండే పరిస్థితులలో ఎంత వైవిధ్యం వుంటుందో అలాగే వాటి ఆహారంలో కూడా అంత వైవిధ్యం వుంటుంది. అందుచేత జంతువులు జీవించే విధంలోనూ, వాటి శరీర నిర్మాణంలోనూ చాలా భేదం వుంటుంది.

ఉదాహరణకు : ఉత్తరధ్రువపు సముద్రతీరాలందూ, ఆర్కిటిక్ మహాసముద్రంలో తేలుతూండే హిమరాసులపైనా ధ్రువపు ఎలుగుబంటి నివసిస్తూవుంటుంది. (చిత్రపటం) ఇది పెద్ద జంతువు. దీని ఒంటిమీద దట్టమైన తెల్లని బొచ్చు వుంటుంది. ఈ బొచ్చువల్ల దానికి చలినుండి చక్కని రక్షణ కలుగుతుంది. ఈ జంతువు తెల్లగా వుండడంచేత మంచుతో కప్పబడిన హిమప్రదేశంమీద పోల్చుకోవడమే ఎంతో కష్టమవుతుంది. ఈ ధ్రువపు ఎలుగుబంటి సీళ్లు అనే జంతువులను భక్షించుతుంది. సముద్రపు నీటినుండి సీళ్లు బయటికి వచ్చినప్పుడు వాటిని అది చంపుతుంది. అంతేకాదు. అది బాగా ఈదడమే కాకుండా నీటిలో మునిగిపోయి నీటి అడుగున కూడా బాగా ఈదగలదు. అందుచేత అది నీటి అడుగునే పొంచి వుండి సీళ్లు మంచుమీదకు రాగానే అకస్మాత్తుగా వాటిమీద పడి వాటిని చంపుతుంది.

ఎలుగుబంటి చిత్రపటం II) పరిసరాలూ, దాని ఆహారమూ పూర్తిగా వేరు. ఈ జంతువు దట్టమైన అరణ్యాల్లో నివసిస్తూ వుంటుంది. దాని బొచ్చు ఎరుపు, నలుపుగా  ............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?