• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kadupu Tipi

Kadupu Tipi By Kumar Kunaparaju

₹ 50

కడుపు తీపి

వృద్ధుడైన చోర్డాన్ ఇంటికి తిరిగి వచ్చాక అతనిలో ఏదో మార్పు చోటు చేసుకున్నట్లు అతని భార్యకి అనిపించింది. అయోమయానికీ, ఆందోళనకు గురై విచారంగా ఉన్నాడని ఆమెకు తోచింది. ఏదో జరిగిందని పసిగట్టింది. అతని నుంచి విషయం రాబట్టితే ఆమె నిర్ఘాంతపోయింది. ఏం చేయాలో తెలియలేదు.

ముసలాడికి ఒక వింత కోరిక కలిగింది. ఈ ముసలివానికి ఓ కొడుకు ఉండేవాడు. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితమే చనిపోయాడు. చాలా చిన్నవయసులోనే యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు, చోర్డాన్కు తప్ప బహుశా ఇంకెవరికీ అతడు గుర్తులేడు. ఇన్నేళ్ళుగా ఆ వృద్ధుడు తన భార్యతో కలిసి జీవించినా, కొడుకు గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఉన్నట్టుండి ఇప్పుడు యుద్ధానికి ముందు తన కొడుకు టీచర్ గా పనిచేసిన ప్రదేశాన్ని చూడాలని నిర్ణయించుకున్నాడు. కానీ అది ఏ విధంగానూ ఒక తెలివైన మనిషి చేసే పని కాదు.

“అతను అక్కడే, ఆ ఊళ్ళోనే ఇంకా బతికే ఉన్నాడనే నాకు తరచూ అనిపిస్తోంది. నేను అక్కడికి వెళ్ళి తీరాలి! వాడ్ని చూడాలి!” అని తన భార్యతో అన్నాడ.

భర్త తీరుచూస్తే మొదట ఆమెకు నవ్వొచ్చింది. అతని వైపు కరుణతో చూసింది. ‘నీకు పిచ్చి పట్టిందా?' అని అనాలనుకుంది. కానీ ఆగిపోయింది. ఆ మాటలలో స్పష్టత, స్వరంలో దృఢత్వం, కళ్ళల్లో ప్రశాంతత, భర్త గంభీరంగా ఉన్నాడని ఆమెకు అర్థం అయ్యింది.......................

  • Title :Kadupu Tipi
  • Author :Kumar Kunaparaju
  • Publisher :Aju Publications
  • ISBN :MANIMN6885
  • Binding :Paparback
  • Published Date :2025
  • Number Of Pages :32
  • Language :Telugu
  • Availability :instock