Logili Books

Autobiography and Biography

Konda Metlu

By C R Naidu

₹180
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Konda Metlu
Author
Publisher
Hari Chandra Publications
ISBN
MANIMN6251
Binding
Papar Back
Published Date
March, 2025
Number Of Pages
195
Language
Telugu
Availability
In Stock
About this book

చదువు

పదోతరగతి మధ్యలో వుండగా మా అమ్మ చనిపోయింది. ఆమెకి కొన్నాళ్లుగా ఆరోగ్యం బాగా లేదు. నేను తొమ్మిదిలో వుండగా మా అమ్మని నేనే రాయవేలూరు ఆస్పత్రికి తీసుకెళ్లాను. దాదాపు అంత దూరం ప్రయాణించడం అదే మొదటిసారి. మా వూరు కొమ్మేపల్లి నుంచి కాలి నడకన దామల్ చెరువు పోయి, అక్కడ బస్సెక్కి చిత్తూరు చేరి, వేలూరు బస్సుకోసం పడిగాపులు కాచి, అది రాగానే ఎక్కాలి. మా నాయిన వేలి ముద్రల నాయిన. అందుకని నేనే అమ్మని వేలూరు ఆస్పత్రికి తీసుకు వెళ్లాను. ఎప్పుడూ నరాలు గుంజినట్టు, వొళ్లంతా చెమటలు పోసినట్లు వుండేదామెకు.

వేలూరులో బస్సు దిగగానే హెూటల్కి వెళ్లి, అక్కడ ఇడ్లీ తిన్నాము. నేను తిన్న ప్లేటులోనే చెయ్యి కడిగేసే సరికి సర్వరొకతను కొట్టినంత పనిచేశాడు. నాకేమో ఇంట్లో అదే అలవాటు. అలా కడగ కూడదని అర్థమైంది. ఆస్పత్రికెళ్లి డాక్టర్కి చూపిస్తే ఆయనేదో బిళ్లలూ, మందూ ఇచ్చాడు గానీ గుణం కనిపించలేదు. తినకపోతే నీరసం, తింటే ఆయాసం అన్నట్టుండి వొకరోజు చనిపోయింది.

మా అమ్మ చనిపోయింది కృష్ణాపురంలో కృష్ణాపురం మా అమ్మమ్మ వాళ్ల వూరు. మా వూరికి సుమారు మైలు దూరముంటుందంతే. మా అక్కనిచ్చింది. కూడా మా అమ్మ తమ్ముడికే - మా చిన్న మేనమామకి. మా అమ్మ - వాళ్ల అమ్మ దగ్గిరా, కూతురి దగ్గరా కొన్నాళ్లు వుండి వద్దాం అనుకుని - కృష్ణాపురం వెళ్లి, అటు నుంచి అటే ఎవరో తరుముకొస్తున్నట్టు దేముడి దగ్గరకు వెళ్లిపోయింది.

వెళ్లిపోయే ముందురోజు పొలం దగ్గరకు వెళ్లి అన్నదమ్ములిద్దరితో . నేను వెళ్లిపోతే నా పిల్లల్ని చూసుకోండి అని చెప్పిందట. తెల్లవారు జామున.........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?