Logili Books

Short Stories

Maha Bodhi Telugu Buddha Kathalu

By B Ajay Prasad

₹400
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Maha Bodhi Telugu Buddha Kathalu
Author
Publisher
Bodhi Foundation
ISBN
MANIMN6533
Binding
Papar Back
Published Date
July, 2025
Number Of Pages
310
Language
Telugu
Availability
In Stock
About this book

మీ పేరేమిటి?

గురజాడ అప్పారావు

దేవుడు చేసిన మనుషుల్లారా!

మనుషులు చేసిన దేవుళ్ళారా! మీ పేరేమిటి?

పురాణములను గురించి మేము శంకలు వేస్తే, మా గురువు గారు “వెధవ చదువు! మీ మతులు పోతున్నాయి. మీరు వొట్టి బౌద్ధులు” అనేవారు.

"బౌద్ధులు యెషువంటి వారు శాస్తుల్లు గారూ?" అని రామ్మూర్తి అడిగాడు. రామ్మూర్తి శతపెంకె.

“రేపు ఆదివారంనాడు పువ్వుల తోటలో ఉపన్యాసం యిస్తాను, అంతా రండి” అని శాస్త్రులు గారు శలవిచ్చారు. ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటలప్పుడు పువ్వుల తోటలో ఒక పరుపు మావిడి చెట్టుకింద యిసకలో మేమంతా పాతికమంది కూచున్నాం. మధ్య గావంచా పరచుకుని, మాకు అభిముఖంగా శాస్త్రులు గారు కూచున్నారు. నేను బల్ల చెక్క తెచ్చి వెయ్యబోతే, “వొద్దురా, మీరంతా కింద కూచుంటే, నేను బల్లమీద కూచుంటాన్రా!" అన్నారు. రెండు కొబ్బరి కాయల నీళ్ళు తాగి, తాంబూలము వేస్తూ, శాస్త్రులు గారు బౌద్ధమతం విషయమై ఉపన్యాసం ఉపక్రమించారు, పది నిమిషములు అయే సరికి, రామ్మూర్తి తన చేతనున్న పుస్తకం విప్పి చూచి, "శాస్త్రులు గారూ, తాము శలవిస్తూన్నదంతా సర్వదర్శన సంగ్రహము లోనిది కాదండీ" అని అడిగాడు. ఆశ్చర్యపడి, శాస్తుల్లు గారు, "ఔరా నీకెలా తెలిసెనురా? అదేం తర్జుమా కాదు గద?" అన్నారు...................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?