Logili Books

Autobiography and Biography

Mallikarjun Kharge

By Durgempudi Chandra Shekar Reddy

₹500
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Mallikarjun Kharge
Publisher
Emasco Books pvt.L.td.
ISBN
MANIMN6968
Binding
Hard Bainding
Published Date
Dec, 2025
Number Of Pages
375
Language
Telugu
Availability
In Stock
About this book

పరిచయం

సుఖదేవ్ థోరాట్, చేతన్ షిండే

తన ఆలోచనలలోనూ, చర్యలలోనూ నిర్దిష్టంగా ఉండడం; దూరదృష్టి కలిగి ఉండడం, మృదుస్వభావి అయినప్పటికీ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటంలో ఔద్ధత్యం; బలహీనుల పట్ల, అట్టడుగు వర్గాల పట్ల వారు ఏ కులాలకు చెందిన వారైనప్పటికీ సహానుభూతి; రాజకీయరంగంలో అన్ని వైపుల నుండి వ్యక్తులను ఆకర్షించగలిగిన ప్రసన్నత; ఇవి ఖర్గేగారితో అనేక సంవత్సరాలుగా కలిసి పనిచేసినవారు ఆయనలో చూసిన లక్షణాలు.

గొప్ప లక్షణాలను కలిగిన నాయకుడు

50 ఏళ్లకు పైగా వివిధ పదవులలో, స్థాయిలలో మల్లికార్జున ఖర్గే గారితో కలిసి పనిచేసినవారు, సామాజిక, రాజకీయ రంగాలలో ఆయన కృషిని సన్నిహితంగా గమనించినవారు ఆయన 80వ జన్మదిన సందర్భంలో, 50 ఏళ్ల ప్రజాజీవితం పూర్తి చేసుకున్న సందర్భంలో వెలువరిస్తున్న ఈ గ్రంథంలో తమ వ్యాసాలు, సందేశాలలో ఆయనలోని గొప్ప లక్షణాల పట్ల తమ గౌరవాన్ని వ్యక్తీకరించారు. ఈ సందేశాలు వివిధ రాజకీయ పక్షాలకు చెందినవారి నుండి వచ్చాయి - కాంగ్రెసు పార్టీ, ఆయన రాజకీయ సహచరులు, భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్), భారత కమ్యూనిస్ట్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఎ.ఐ.ఎ.డి.ఎం.కె., భారతీయ జనతా పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు, అలాగే కర్ణాటక శాసనసభలోనూ, లోక్సభ, రాజ్యసభలలోనూ ప్రతిపక్ష నాయకుడిగా శ్రీ మల్లికార్జున ఖర్గేతో కలిసి పనిచేసినవారు, ఆయనతో పనిచేసిన ప్రభుత్వాధికారులు, కుటుంబ పరిచయస్థులు, మిత్రులు. వీరంతా ఆయన పట్ల తమ గాఢమైన గౌరవాన్ని వ్యక్తం చేశారు. అందరూ ఖర్గే గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆయనతో తమ అనుభవాలను ఆత్మీయంగా జ్ఞాపకం చేసుకున్నారు. ఈ అనుభవాలు వారి...............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?