Logili Books

History

Mata Marpidi

By Dr B R Ambedkar

₹60
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Mata Marpidi
Publisher
Bhoomi Book Trust
ISBN
MANIMN6929
Binding
Paparback
Published Date
Dec, 2025 2nd print
Number Of Pages
39
Language
Telugu
Availability
In Stock
About this book

మతం మార్పిడి?

హిందూ మతాన్ని విడనాడేందుకు నేను ఈ మధ్యనే యోలా మహాసభలో చేసిన ప్రకటనపై పూర్తి పరిశీలన గావించుటకు ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మీరీపాటికి తెలుసుకొనే వుంటారు. మతం మార్పిడి విషయంపై మీ పూర్తి భవిష్యత్ ఆధారపడి వున్నందున నాకూ ఇది ఎంతో ఇష్టమయిన విషయంగా భావిస్తున్నాను. మతం మార్పిడి ప్రాముఖ్యతను మీరు గుర్తించారని చెప్పడానికి నేనేమీ సందేహించుటలేదు. ఇది వాస్తవం కాకపోతే మీరింత అసంఖ్యాకంగా ఈ మహాసభకు హాజరయి వుండేవారు. కాదు. ఇంతటి జన సమూహాన్ని చూస్తుంటే నాకెంతో ఆనందం కలుగుతుంది.

మతాన్ని మార్చుకోవడానికి నేను నిర్ణయం తీసుకొన్న నాటి నుండి మన కార్యకర్తలు అనేక సభలు, సమావేశాలు పలు ప్రదేశాలలో జరిపి మతాన్ని మార్చుకోవాల్సిన అవసరాన్ని గూర్చి వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలను మీరు అర్థం చేసుకొనే వుంటారనుకొంటున్నాను. మనమంతా కలిసి మతాన్ని మార్చుకొనే సమస్యపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇంతవరకు మనకా అవకాశమే రాలేదు. ఇటువంటి అవకాశము కొరకే నేను ఎదురుచూస్తూ వచ్చాను. మతం మార్పిడి ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి ఒక పటిష్టమైన ప్రణాళిక ఎంతో అవసరమని మీరంతా అంగీకరిస్తారు. మతాన్ని మార్చుకోవడమనేది చిన్న పిల్లల పనేమీ కాదు. ఇది మానవ జీవన విధానాన్ని ఎలా జయప్రదం చేయాలన్న సమస్యలను గూర్చి చర్చిస్తుంది.

సముద్రయానం చేసే ముందు నావికుడు అందుకు కావాల్సిన పరికరాలను ఏ విధంగా సిద్ధపరచుకొంటాడో, మతం మార్పిడి గూర్చి మనం కూడా అటువంటి జాగ్రత్తలనే తీసుకోవాల్సి వుంటుంది. ఏ విధమయిన సరంజామా లేకుండా నావికుడు ఆవలి ఒడ్డును చేరుకోవడం సాధ్యం కాదు. ప్రయాణీకులెందరో ముందు అంచనా వేయకుండా నావికుడు సామానును పడవలో చేర్చుకోనట్లే ఖచ్చితమయిన సమాచారమేదీ లేకుండా మతం మార్పిడి విషయమై నేను ముందుకు పోలేను. ఎందరీ హిందూమతాన్ని వదలడానికి సిద్ధంగా వున్నారో తెలియకుండా, నేను మతం మార్పిడి కార్యక్రమాన్ని సిద్ధం చేయజాలదు. మతం మార్పిడి కార్యక్రమాన్ని చేపట్టేముందు ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోనిదే నేను ఓ నిర్ణయానికంటూ.....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?