• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Na Chaduvu Katha

Na Chaduvu Katha By Dr Barghavi

₹ 150

నా చదువు కథ

నా చదువు అంటే నేను చదువుకున్న ఫార్మల్ ఎడ్యుకేషన్ గురించి కాదు. సాహిత్యంతో నా పరిచయం గురించీ, పుస్తకాలతో నా ప్రయాణం గురించీ...

అసలు అక్షరాలు నాకు పరిచయమయ్యింది చెరువుగట్టు బళ్లో. ఆ బడి చెరువు గట్టున వుండేది కాబట్టి చెరువుగట్టు బడి అని పిలిచే వారందరూ. అక్కడి ఉపాధ్యాయులెవరో గుర్తు లేదు కానీ నేలమీద మెత్తని మన్నుమీద వేసిన నేలబారు బల్లలపైన కూచోవడం గుర్తు. అక్కడ పిల్లలలో చాలా స్వతంత్ర భావాలుండేవి. కొంతమంది మట్టి కుప్పలుగా చేసి నెత్తిమీద పోసుకునే ఆటలాడితే, ఇంకొంతమంది పక్క పిల్లల జడరిబ్బన్లు లాగుతూ వుండేవాళ్లు, మరికొంతమంది కళ్లూ చేతులూ తిప్పుతూ కబుర్లు చెబుతూ వుండేవాళ్లు. మేష్టార్ని పిల్లలూ, పిల్లలని మేష్టారు యేమీ పట్టించుకునేవారు కాదు. ఎవరి లోకం వారిదే. కొన్నాళ్లు బళ్లో అలా ఆటలాడుకున్నాక మా ఇంట్లో ఒక రోజు యేదీ అఆ లు రాయి అన్నారు అంతే నేను అఆ లు తల్లకిందులుగా రాసి పలక తిప్పి చూపించానట!......................

  • Title :Na Chaduvu Katha
  • Author :Dr Barghavi
  • Publisher :Badari Publications
  • ISBN :MANIMN6888
  • Binding :Paparback
  • Published Date :Jan, 2026 2nd print
  • Number Of Pages :85
  • Language :Telugu
  • Availability :instock