Logili Books

Short Stories

Nalla Regallu ( Krishna Theera Kathalu)

By Iqbal

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Nalla Regallu ( Krishna Theera Kathalu)
Author
Publisher
Palamuru Adyayana Vedika
ISBN
MANIMN7101
Binding
Paparback
Published Date
May, 2026
Number Of Pages
143
Language
Telugu
Availability
In Stock
About this book

ఆర్తి కథలు

సహచరులు ఇక్బాల్ కథల పుస్తకం 'నల్ల రేగళ్ళు' ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని శ్రామిక జనుల ఆరాట పోరాటాలకు సంబంధించినది. ఇందులోని పది కథలు ప్రథమపురుషలో రచయితే తన లోతైన గాఢమైన, మమేకత్వంతో ఆర్తితో రాసిన కథలు.

ఒక కథ ప్రఖ్యాత ఉర్దూ రచయిత సాదత్ హసన్ మంటో కథను ఇంగ్లీషు నుండి తెలుగులో అనువాదం చేశారు. మూడు కథలు ముస్లిం గ్రామీణ జీవన నేపథ్యంలో, మరో నాలుగు కథలు విధ్వంసమౌతున్న గ్రామీణ జీవితంలోనుండి పట్టణాలకు వలసపోవడం; ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రమాదకరమైన రసాయనిక పరిశ్రమలను గ్రామీణ ప్రాంతపు పంట పొలాల్లో దుర్మార్గంగా, మాయోపాయాలతో ఏర్పాటు చేయడం వలన జరిగే విధ్వంస, విస్తాపనల గురించిన కథలు. ఒక కథ సేవక వృత్తికి సంబంధించినది - మరోకథ గ్రామీణ ప్రాంతాలల్లో కరడుగట్టిన భూస్వామ్యం ముందు రాజ్యాంగం, కోర్టులు, చట్టాలు ఏమీ చేయజాలవని ప్రజలు తమ మీద జరిగిన పీడన, హింసల ద్వారా గ్రహించిన సత్యం కథ. మరో కథ చదువువలన పరాయీకరణచెంది మధ్యతరగతిగా మారిన ‘క్లాస్మేట్స్' కథ. అనువాద కథ పాకిస్థాన్, భారత్ క్రూరమైన విభజన నేపథ్యంలో అతలా కుతలమైన ముస్లిం యువతి జీవిత కథ.

మొత్తంగా అతిపురాతన బ్రాహ్మణీయ భూస్వామిక భారతీయ సమాజం- తొలుత వలస, అర్ధవలస అర్ధభూస్వామిక సమాజంగా మారినా కూడా - భూస్వామిక హింసాత్మాక ఉత్పత్తి విధానం, ఉత్పత్తి సంబంధాలు విధ్వంసకరంగా మారి మరింత దోపిడి పీడనకు ప్రజలను గురించేశాయి. ఉత్పత్తి శక్తులు తమకు అవరోధంగా మారిన ఉత్పత్తి సంబంధాల సంకెళ్ళను బద్దలు కొట్టే ప్రజా పోరాటాలు సుదీర్ఘకాలంగా విముక్తి దిశగా జయాపజయాల మధ్య పురోగమిస్తున్నాయి. అలాంటి పోరాటాలల్లో తమ వంతు కర్తవ్యంగా అధ్యయనం, అర్థం చేసుకోవడం, తమ స్థల కాలాల నేపథ్యంలో ప్రజాపోరాటాలల్లో భాగంకావడం 1970నుండి విప్లవ రచయితల సంఘం చేస్తున్నది. సమాజాన్ని గతితార్కికంగా, చారిత్రికంగా,.........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?