జీవితంలో కొన్ని సందర్భాలకి రీజనింగ్, లాజిక్స్ ఉండవు. ఇదెందుకు ఇలా జరుగుతుంది అంటే సమాధానం ఉండదు. దీనికి కారణం నేనేనా అనే ప్రశ్నకి అసలు అర్థమే ఉండదు. నా జీవితానికి నేనే ప్రేక్షకుడినై, జరిగే సంఘటనలని చూస్తూ కదిలిపోతుండటం ఒక విచిత్ర అనుభవం.
వచ్చిన పని పూర్తయ్యింది. తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఈ ఆలోచన వచ్చిన ప్రతీసారి మనసులో ఒక గందరగోళం. తప్పదా? వెళ్ళాలా? ఒకవేళ వెళితే? ఒంటరి పక్షికి లోకంలో ఏ చెట్లైనా, ఇంటి వెంటిలేటరయినా ఇల్లే కదా. ఒంటరి అనే మాటని, లోకం తెలియని వయసులో భయంగా వినేవాడిని, ఒకానొక టైంలో అదేదో ట్రెండ్ నేను ఒంటరి, నేను ఒంటరి అని చెప్పుకుంటూ హై ఫీల్ అయ్యేవాడిని. కానీ, నిజంగా ఒంటరితనం అంటే ఏంటో తెలిసాక, అందులోంచి బయటికి రావాలని ఎంతో ప్రయత్నించాను. కొద్దికొద్దిగా నేను ఆ ఒంటరితనాన్ని ఇష్టపడుతూ................