• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Neeliragamu

Neeliragamu By Unnam Jyotji Vasu

₹ 90

సారి కీ.శే. ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి మాట్లాడుతూ - 'వాల్మీకి లోకానికి ఒక మహోపకారము, ఒక మహాపకారమూ చేశాడు' అన్నారు. ఏమిటవి? అన్నారు. ఎస్వీ భుజంగరాయశర్మ. '

                           రామాయణాన్ని వ్రాసి ఈ జాతి అభిరుచుల్ని, అభిప్రాయాల్ని యుగయుగాలుగా తీర్చిదిద్దాడు. అది మహోపకారం కదా' అన్నారు ఇంద్రగంటి. 'సరే! అపకారమేంటి' అన్నారు.మరికొత్తది రాయడానికి ఎవరికీ ఏమీ మిగల్చలేదు' అన్నారు ఇంద్రగంటి. నిజమేనంటూ నవ్వుతూ తలూపారు ఎస్వీ.

                           వాల్మీకికి మనుషులంటే చాలా ఇష్టం. రాగద్వేషాల మధ్య నలిగిపోతూ ఏదో ఒక ఆదర్శం పెట్టుకుని - దాన్నందుకోవాలని బ్రతుకంతా తపనపడే మనుషులంటే మరీ ఇష్టం. ఆయన కంటికి సీతారాములు గుళ్లో దేవుళ్లు కారు. మన కళ్లముందు నడయాడే సజీవ పాత్రలు.

                            ఈ మానవ ప్రపంచంలో కవిత్వానికి శ్రీకారం చుట్టింది, రసలోకాలకు తొలిసారి తలుపులు తెరిచిందీ, ఆనందామృతాన్ని యుగయుగాలుగా చూరలిచ్చింది - అతడే. కాళిదాసు నిఘంటువులో కవి అన్నా కూడ అతడే. అందుకే విశ్వసాహిత్యంలో ఉత్తమశ్రేణి కవి అయ్యాడు.

  • Title :Neeliragamu
  • Author :Unnam Jyotji Vasu
  • Publisher :U.Swapna
  • ISBN :MANIMN2674
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :136
  • Language :Telugu
  • Availability :instock