• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Nostalgia

Nostalgia By Potturi Vijayalakshmi

₹ 300

ఎలాగైనా... రండి పండగకి!

సంక్రాంతి సెలవులు ఇచ్చేశారు. మా ప్రయాణం విషయం అటూ ఇటూ కాకుండా వుంది. మాకంటే ఖచ్చితంగా సెలవులు ఇచ్చేస్తారు గానీ, నాన్నగారికలా వుండవు. పండగ రెండురోజులూ దొరికితే గొప్ప.. ఆఖరిక్షణంలో ఏదైనా అవాంతరం వస్తే పరుగులు పెట్టాల్సిందే పాపం. ఈ సారి ఎవరో పెద్ద ఆఫీసరుగారు పండగ వెళ్లిన వెంటనే ఇనస్పెక్షనుకు వస్తారట. సెలవు దొరుకుతుందో లేదో అని సందేహం. పోనీ మేము వెళ్లామంటే వేళికి నాన్నగారికి వీలు కాకపోతే, పండగకి తలోచోటా ఉండాలి. మా తాతయ్య గారు అందుకు ససేమిరా అంటారు. మీకు వీలుకాకపోతే, కబురు పెడితే మేమే వస్తాం అంటారు. దీంతో ఇంకా ఊగిసలాడుతోంది మా ప్రయాణం.

యాజలి వెళ్లినా వెళ్లకపోయినా బొమ్మలకొలువు పెట్టాల్సిందే కాబట్టి, ఇక్కడా ప్రయత్నాలు మొదలు పెట్టాం. నాన్నగారు అట్టలతో మేడలు తయారు చెయ్యటం మొదలు పెట్టారు. నేల మీద ఇళ్లూ, రోడ్లూ, పార్కులూ అమర్చి అద్భుతంగా చేస్తారు. అందుకే, మా ఇంట్లో కొలువు చూడ్డానికి పిలవకపోయినా......................

  • Title :Nostalgia
  • Author :Potturi Vijayalakshmi
  • Publisher :Classic Books
  • ISBN :MANIMN5876
  • Binding :Paerback
  • Published Date :Nov, 2024
  • Number Of Pages :310
  • Language :Telugu
  • Availability :instock