Logili Books

Paatalu / Geyalu

Padudhaama Swecchageetham- Marikonni Paatalu

By Ganteda Gowrunayudu

₹300
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Padudhaama Swecchageetham- Marikonni Paatalu
Publisher
Chikati Prachuranalu
ISBN
MANIMN6230
Binding
Papar Back
Published Date
April, 2025
Number Of Pages
307
Language
Telugu
Availability
In Stock
About this book

పాడుదమా స్వేచ్ఛా గీతం

పాడుదమా స్వేచ్ఛా గీతం

ఎగరేయుదమా... జాతిపతాకం

దిగంతాలు నినదించి

విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం.........................||పాడుదమా||


 

జలియన్ వాలా బాగు దురంతపు

నెత్తుటిధారల నొత్తుకొని

ఉరికొయ్యల చెరసాలల గోడల

దారుణాలు తలకెత్తుకొని

పొగిలిన కాలం... పోరాడిన కాలం...

మరి మరి ఒకపరి తలచుకొని

మృతవీరుల నెదనిడి కొలుచుకొని......................||పాడుదమా||



 

వందేమాతరమని నినదించిన

వీరుల శౌర్యము నలదుకొని

స్వాతంత్య్రం నా జన్మహక్కని

గర్జించిన గళమందుకొని

పోరాట బలం... స్వాతంత్య్ర ఫలం

కలకాలం కాపాడుకొని

కడు గర్వంగా కొనియాడుకొని... .....................||పాడుదమా||



 

మన్నెం గుండెల మంటై రగిలిన

విప్లవ జ్యోతి స్ఫూర్తియని

గుండు కెదురుగా గుండెను నిలిపిన

తెలుగు సింగముల తెగువగని........................ ||పాడుదమా||

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?