Logili Books

Telugu

Patrika Basha Nighantuvu

By K Balasubramaniyan

₹220
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Patrika Basha Nighantuvu
Publisher
Potti Sriramulu Telugu Viswavidyalayam
ISBN
MANIMN6797
Binding
Paparback
Published Date
2018 2nd print
Number Of Pages
393
Language
Telugu
Availability
In Stock
About this book

భూమిక

  1. నిఘంటు నిర్మాణ సంప్రదాయం కోశ నిర్మాణ పరంపరలో ఈ నిఘంటువు

భారతదేశంలో నిఘంటు నిర్మాణం ప్రాచీనకాలం నుంచీ ఉన్నది. యాస్కుని నిరుక్తం నుంచీ అచుర సింహుని అమరకోశంనాటి నుంచీ ఈ సంప్రదాయం కొనసాగుతూవస్తున్నది. భారతీయ నిఘంటు నిర్మాణం కంఠస్థం చేసేందుకు అనుకూలంగా ఉండేది. ఆధునిక విఘంటు నిర్మాణ పద్ధతి అక్షర క్రమంపై ఆధారపడి ఉన్నది. దీనివల్ల అవసరమైన పదాలను వెంటనే వెతుక్కోవటం సులభమైనది. మిషనరీ సంస్థలు, బ్రిటిష్ అధికారులు ఆధునిక నిఘంటు నిర్మాణ పద్ధతులను రూపొందించటంలో భారతదేశంలో ముఖ్యపాత్ర వహించారు. సంస్కృతంలో మోనియర్ విలియమ్స్, మరాఠీలో మోల్స్వర్త్, తమిళంలో వి, తెలుగులో 'పి.పి. బ్రౌన్, కన్నడంలో కిటెల్, మళయాళంలో గుండర్డ్, బెంగాలీలో క్యారి, కాశ్మీరీలో గ్రియర్సన్, హిందూస్తానీలో ఫెర్గూసన్ తదితరులు ఈ రంగంలో ముఖ్యులు. ఈ విద్యావేత్తలు కూర్చిన నిఘంటువులు 18, 19 శతాబ్దాలలో ప్రచురించబడి ఈ నేపథ్యంలో భారతీయ విద్యావేత్తల కృషి ఫలితంగా; తెలుగులో సూర్యరాయాంధ్ర నిఘంటువు, మద్రాసు విశ్వ విద్యాలయం వారి తమిళ నిఘంటువు, అలహాబాద్ హిందీ సాహిత్య సమ్మేళన్ వారి మానక్ హిందీ కోశ్ తయారయ్యాయి. అయితే ఆ తర్వాత అడపాదడపా వచ్చిన నిఘంటువులున్నా, సజీవంగా నిఘంటు నిర్మాణం కొనసాగలేదవే భావించాలి.

ప్రాంతీయ భాషలను విద్యామాధ్యమాలుగా ప్రవేశ పెట్టిన తర్వాత, భారతీయ భాషలు త్వరగా అభివృద్ధి చెందసాగాయి. ప్రసార సాధనాలైన వార్తా పత్రికలు, మాగజైన్లు, రేడియో, టీవీలు ఇబ్బడి ముబ్బడిగా అభివృద్ధి అయినవి. భారతీయ భాషలు పాలవా భాషలుగా చట్ట వ్యవహారాల భాషలుగా కొత్త రంగాలలో ముందుకు వచ్చాయి. ఈ మార్పుల వల్ల భాషలలో అనేకరంగాలలో 'పదజాల విస్పోటన' జరిగింది. ఈ పదజాల విస్ఫోటనను అందుకొని, తగిన నిఘంటువులను తయారు చేయడంలో జరిగిన కృషి అంతంత మాత్రమే. తెలుగులో పరిస్థితి చూసినా ఇందుకు భిన్నంకాదు. అప్పటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురించిన వృత్తిపదకోశాలు మైలురాళ్ల వంటివే. అయినా కొత్తగా రూపొందిన, పాలన, రాజకీయ, శాస్త్రీయ, పత్రికా రచన రంగాలలో విస్తృతంగా పెరిగిన వేలాది పదాలు నిఘంటువులకు ఎక్కవలసి ఉన్నవి. తెలుగు అకాడమీ గతంలో ప్రచురించిన పదపట్టికలు, పదజాలాన్ని పాక్షికంగా మాత్రమే ఇవ్వగలిగాయి. పైగా ఈ పదపట్టికలు సజీవ భాషాప్రయోగాల మంచి, తయారైనవి కావు. భాషా ప్రణాళికా కార్యక్రమంగా పదశూన్యతను భర్తీ చేసేందుకు తయారు చేసిన సాంకేతికపదజాలమది. ఆధునిక అవసరాలకు సరిపడే సజీవ తెలుగు భాషా నిఘంటువు. లక్ష్యంగానే ఉన్నది. భిన్న స్థాయిలలో విద్యార్థులకోసం, తెలుగు నేర్చుకొనేవారికోసం అమవాద కులకోసం - అవసరమైన నిఘంటువులు రావలసి ఉన్నవి. భిన్న అర్థఛాయలలో పదాల ప్రయోగాలను చూపే కోశాలు, సమాసాల, పలుకుబడుల నిఘంటువులు, పదాల.....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?