• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Prajala Kathe Na Atma Katha

Prajala Kathe Na Atma Katha By Bandaru Dattatreya

₹ 500

ఎక్కడ మొదలుపెట్టను?

గుడుంబా, జూదం, పేదరికం పరచుకున్న. క్రిక్కిరిసిన పేదలవాడలో వీధిబడిలో చదువుకొన్న రోజులు.... బాల్యంలోనే అనారోగ్యంతో నాయన మరణిస్తే, కుటుంబాన్ని పోషించడం కోసం సంప్రదాయాలను ధిక్కరించి అమ్మ వ్యాపారం చేయాల్సివచ్చిన రోజులు...

యువ డాక్టర్ షిండే అనే యువకుడు మా ఇంటిచుట్టూ తిరిగి నన్ను ఆటలాడించడానికి సంఘానికి తీసుకెళ్లిన రోజులు...

చదువులో విఫలమవుతానేమో అని భయపడ్డ కాలంలో కాలేజీ సుందరి వహీదా బేగం మార్గదర్శనంలో డిగ్రీ పట్టా అందుకున్న క్షణాలు...

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్గా వెళ్లిపోవాలని ఉత్సాహం ఉరకలు వేసిన రోజులు.... ఎమర్జెన్సీ రోజుల్లో పోలీసులు తరుముతుంటే స్వయంసేవకులకు నైతిక మద్దతునివ్వడం కోసం మారువేషాలలో పర్యటనలు చేసిన సందర్భాలు...

భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపిస్తూంటే జైలులో పెద్దల ఆధ్యాత్మిక బోధనలతో కొత్త చైతన్యాన్ని పుంజుకున్న క్షణాలు...

అర్ధరాత్రి గ్రామాలమీదకి విరుచుకుపడిన సముద్రంలో వేలాది ప్రాణాలు బలైపోతే, దివి తాలూకాలో ఉప్పునీటి మేటల మధ్య శవాలని ఏరుతూ, దహనం చేస్తూ కన్నీరు కార్చిన సేవాదినాలు...

సంఘ్ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి పోరాటాలలో, ఉద్యమాలలో తిరగాల్సివచ్చిన రోజులు... భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో సైతం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎండల్లో, వానల్లో పర్యటించిన అనుభవాలు...

ఎన్ని ఉద్యమాలు! '60 గజాల ఇళ్ల స్థలం' కోసం 3000 మంది పేదల తరఫున పోరాటం. గుడిసెలు ఉన్నచోట ఇళ్లు రావాలని, దారిలేని చోట రోడ్డు పడాలని, బడుల్లో సదుపాయాలు పెరగాలని చేసిన ఉద్యమాలు...

గుండెపోటుకు గురై ప్రచారానికి తిరగలేని రోజుల్లో కూడా ఎన్నికల్లో పోటీ చేసి 1998లో భారత పార్లమెంటుకు 1.86 లక్షల ఓట్ల మెజారిటీతో ఎన్నికైన ఉద్విగ్న క్షణాలు....

అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఎంఎంటీఎస్ రైళ్ళను ప్రవేశపెట్టి ఉద్యోగులు, వ్యాపారుల అభినందనలు అందుకున్న ఘట్టాలు......................

  • Title :Prajala Kathe Na Atma Katha
  • Author :Bandaru Dattatreya
  • Publisher :Emesco Books pvt.L.td.
  • ISBN :MANIMN6322
  • Binding :Hard Binding
  • Published Date :May, 2025
  • Number Of Pages :312
  • Language :Telugu
  • Availability :instock