ముద్రా విజ్ఞానం ఆసనము, ప్రాణాయామము. ప్రత్యాహారము, ధారణలతో కూడినది. ముద్ర మంత్రము, యంత్రము, తంత్రముల ద్వారా ధ్యానము చేస్తాము. ముద్ర యోగా లేక తంత్రము లోని ఒక భాగము. మద్రలు నిలకడనిస్తాయి. ముద్రల ద్వారా ఏకాగ్రత సాధించి మనస్సుని అదుపులో ఉంచుకోవచ్చు. ముద్ర అనగా ఒక సంజ్ఞ, ఒక గుర్తు కూడా. ముద్ర అనేది సంస్కృత ధాతువు "ముద్" నుండి గ్రహింపబడింది. ముద్-ముదము/ సంతోషం, ద్రు=గ్రహించు. ముద్రలు వేయటం ద్వారా మనకు ధ్యానంలో ఏకాగ్రత కుదిరి, శరీరాన్ని ఆత్మతో సమన్వయ పరచగలుగుతాం కాబట్టి, ఆనందాన్ని పొందుతాము. ఆసనములు, ప్రాణాయామము, ముద్రలు వంటి వాటిని అభ్యసించుటచే సుషుమ్న వాడి యందు కుండలినీ శక్తి సంచారము కలుగును. వాయు ధారణతో కూడిన 'అసనములే ముద్రలు, బంధాలు అను నామాంతరముచే పిలువబడుచున్నవి. ముద్రలు అభ్యసించిన యెడల మానసిక సైర్యము ఏర్పడును అని తెలియుచున్నది. ముద్రలు సర్వ వ్యాధులను నశింపచేసి జఠరాగ్నిని వృద్ధి చేయును. ముద్రలు మానసిక ఉద్రేకానికి, భక్తికి సంబంధించినవి. ముద్రలు ప్రాణశక్తికి, విశ్వశక్తికి ఉన్న సంబంధాన్ని సూచించును. పంచ భూతముల సిద్ధి కలిగిన తరువాత మృత్యువుని కూడా సాధకుడు జయించగలడు. శ్వాసకోశములు, ప్లీహము వృద్ధి, కుష్టు మొదలగు ఇరువది రకముల శ్లేష్మ రోగములు ముద్రాభ్యాసము వలన నశించుననుటలో సందేహము లేదు..! ముద్రలు సూటిగా మన మనస్సు, నాడీ మండలం, గ్రంధుల ప్రణాళికలతో పాటు 'స్వయంగా పని చేసుకోగలిగే శరీర అవయవాల మీద కూడా తమ ప్రభావాన్ని చూపిస్తాయి. కనుక ఆసనాలు, ప్రాణాయామాల వలె ముద్రలు కూడా చాలా 'ముఖ్యమైనవి. నిజానికి నాడీ జ్ఞానం సంపాదించనిదే యోగ సిద్ది లభించడం కష్టం ఇది యోగ ముద్రల వల్లనే సాధ్యం. చేతులు ముద్రలో సిరముగా ఉంచి, కళ్ళు............