Logili Books

Autobiography and Biography

Sardar Sarvai Papanna Goud

By Sreenishanth

₹99
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sardar Sarvai Papanna Goud
Author
Publisher
Sreenishanth, hyd
ISBN
MANIMN7024
Binding
Paparback
Published Date
2024
Number Of Pages
87
Language
Telugu
Availability
In Stock
About this book

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

ప్రపంచంలో ఎక్కడ చూసినా బలం ఉన్నోడిదే నడుస్తది. ఇప్పుడున్న ప్రజాస్వామ్యంల ఈ బలం ప్రజాబలం. ఇంతకు ముందున్న రాచరిక వ్యవస్థల ఈ బలం రాచరిక బలం. ఈ రాచరిక బలవంతులు రాజులు, సుబేదారులు, దొరలు, జమీందారులు, జాగీర్దారులు. రాచరిక వ్యవస్థలో సామాన్య ప్రజలకు అస్సలు విలువుండకుండె. రాచరిక బలవంతులు చెప్పిందే న్యాయం, చేసిందే చట్టం.

రాచరిక వ్యవస్థలో స్థానిక సుబేదారులు, దొరలు, జమీందారులు, జాగీర్దారుల ప్రజలపై విపరీతమైన పన్నులు వేసి, వసూలు చేస్తుండేవారు. ప్రజలను దోచుకునేవారు. సామాన్య ప్రజలకు రక్షణ కరువైంది. దీని వల్ల సామాన్య ప్రజల బతుకులు, ముఖ్యంగా అణగారిన వర్గాల ప్రజల బతుకులు చాలా దయనీయంగా ఉండె.

అణగారిన వర్గాల ప్రజల బతుకులు మార్చాలంటే అది కేవలం రాచరిక బలంతోనే సాధ్యమయితది. తన లాంటి అణగారిన వర్గాల ప్రజల బతుకులలో వెలుగులు నింపడానికి ఈ రాచరిక బలం సాధించిన ఒక అసమాన్య యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్! సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ని ప్రజలు ఆప్యాయంగా 'పాపన్న' అని పిలిచెటోల్లు. ఈ పేరే ఈ పుస్తకంలో వాడబడ్డది.

ఒక సామాన్య గౌడ కుటుంబంలో పుట్టిన పాపన్న సాటి అణగారిన వర్గాలకు చెందిన ప్రజల మద్దతుతో రాజ్య నిర్మాణం చేసిండు. వారికి రక్షణ ఇచ్చిండు. దీంతో సామాన్య ప్రజలు స్వచ్చందంగా పాపన్న అనుచరులయ్యిన్రు. ప్రజాబలంతో వృద్ధిచెందుతున్న పాపన్నను ఎదుర్కొనే శక్తిలేని అగ్రకులాలకు చెందిన దొరలు, జమీందారులు, జాగీర్దారులు పాపన్నను ఎలాగైనా అంతమొందించాలనే కోరికతో.........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?