Logili Books

Autobiography and Biography

Sri Sri Kompelli Janardhan Rao Jeevitam Samagra Sahityam

By Etukuri Prasad , Yamijala Ananad

₹500
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sri Sri Kompelli Janardhan Rao Jeevitam Samagra Sahityam
Publisher
Nava Chetan Publishing House
ISBN
MANIMN7055
Binding
HARD BAINDING
Published Date
April, 2026
Number Of Pages
551
Language
Telugu
Availability
In Stock
About this book

కొంపెల్ల జనార్దనరావు

-------------- శ్రీరంగం శ్రీనివాసరావు

కొంపెల్ల జనార్ధనరావుతో నాకు మొట్టమొదటిసారి 1928వ సంవత్సరం మద్రాసులో తంబుబెట్టి వీధిలో పరిచయమైంది. ఆయేడే కొత్తగా నేను చదువు కోసం మద్రాసులో అడుగుపెట్టాను. మా నాన్న క్రిష్టియన్ కాలేజీలో నాకు బి.ఏ., జూనియర్ తరగతిలో సీటు సంపాదించి తంబుబెట్టి వీధిలోని ఫస్ట్ స్టూడెంట్సు హెూమ్ లో నన్ను ప్రవేశపెట్టి విశాఖపట్నం వెళ్ళిపోయాడు. హాస్టలులో అందరూ నాకు కొత్త. అసలు మద్రాసు నగరమే ఒక మహా సముద్రంలాగ కనిపించేది. అప్పుడు నా వయస్సు 18 ఏళ్ళు, నా కంటే జనార్దనరావు ఒకటో, రెండో ఏళ్ళు పెద్ద. తంబుడు కాదు అన్నే కాబోలు అని ఒక ఉత్తరం ముగించి సంతకం చేశాడు. వస్తున్నా అప్పటికింకా జనార్దనరావుని ముఖస్థంగా కలుసుకోలేదు. అంతకుముందు ఒకటి రెండుసార్లని పద్యాలు చదివాను. ఇప్పటికీ తంబుచెట్టివీథిలో ఉంటున్న ఒక సుప్రసిద్ధ మాసపత్రికలో అప్పుడే పేరుతో నా కొకానొక భావ బాంధవ్యం ఏర్పడింది. జనార్దనరావు నాకన్న బాగా పద్యాలు రాయగలడని; నాలో నేనే రహస్యంగా అంగీకరించాను. కాని నేను కూడా అతనికేమీ తీసిపోనని నాలోని స్వాతిశయం నన్ను హెచ్చరించేది. అవి భావకవిత్వపు రోజులు. సాహిత్య లోకంలో సాహితీసమితి నాయకత్వమూ, అందులో మళ్లీ చీలికలూ, తిరుగుబాట్లూ, కొంతమంది తప్పుకోవడమూ ఇవీ ఆనాటి హెడ్లైన్ న్యూస్.

అంటే సాహిత్యం కోసమే ప్రత్యేకించిన దినపత్రికలుంటేమాట: ఆనాటి సాహిత్య ధోరణులన్నింటికీ స్థానం ఇస్తున్న ఒకే ఒక పత్రిక ఇందాకా నేను చెప్పిన పత్రిక. అందులో నీ పద్యం పడిందంటే కవిగా నీకు సాహిత్య లోకంలో జాగా దొరికిందన్నమాట. కథ పడిందంటే కథకుడుగా నిన్ను లోకం గుర్తించిందన్న మాట. విమర్శ వ్యాసం రాశావంటే, నీ అభిప్రాయాలు విలువయినవన్నమాట. నీ పుస్తకాన్ని ఆ పత్రిక మెచ్చుకున్నదంటే, నువ్వు గొప్ప రచయితవి. అటువంటి ఆ పత్రికలోనే జనార్ధనరావు సబ్ ఎడిటరుగా పనిచేస్తున్నాడు. ఉండండి ఆ సంగతి నాకప్పుడే తెలియడంలేదు. ఎలా తెలిసిందో ఇప్పుడే చెప్పబోతున్నాను...........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?