Logili Books

Devotional and Religion

Sundara Kanda Sakalakarya Sidhiki

By Dr Burgula Purnacandra Prasad

₹120
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sundara Kanda Sakalakarya Sidhiki
Publisher
Vasundhara Publications
ISBN
MANIMN3633
Binding
Papar back
Published Date
2022
Number Of Pages
70
Language
Telugu
Availability
In Stock
About this book

సుందరకాండ 

శ్లో|| సున్దరే సున్దరో రామః సున్దరే సుందరీ కథా

      సున్దరే సున్దరీసీతా ! సున్దరే సువర్ధం వనం |
      సున్దరే సున్దరం కావ్యం సుందరే సుందరః కపిః |
      సున్దరే సున్దరం మంత్రం సున్దరే కిం న సున్దరం ||

సుందరకాండమున శ్రీరాముడు సుందరుడు. అందలి కథయు మిక్కిలి సుందరమైనది. సుందరకాండమున సీతయు సుందరి. సుందరకాండము నందలి వనము సుందరమైనది. సుందరకాండము నందలి కావ్యరచనయు సుందరముగా నుండును. సుందరకాండమున హనుమంతుడు సుందరుడు. సుందరకాండమున నందలి మంత్రము సుందరమైనది. వేయేల? సుందరకాండమున సుందరము | కానిదెయ్యది గలదు. అంతయు సుందరమే.

వాల్మీకి మహర్షి అన్ని కాండములకు వానిలో గల యితివృత్తమునకు తగినట్టుగా పేరు పెట్టి యీ కాండమునకు సుందరకాండయని పేరు పెట్టినాడు. దానికి గల కారణమును పై శ్లోకము ఋజువు పరచుచున్నది.

శ్లో|| రామ ఏవపరం బ్రహ్మ రామ ఏవపరం తపః |

      రామ ఏవపరం తత్త్వం శ్రీరామోబ్రహ్మతారకం ||

శ్లో|| సప్తకోటి మహామంత్రా: చిత్తవిభ్రమ కారకాః |

      ఏక ఏవపరోమంత్రః రామయిత్యక్షర ద్వయం| 

అటువంటి రామనామమును తన అణువణువు నాలీనము జేసికొని, తన మనోవాక్కాయ కర్మలను రామనామాంకితము జేసి, రామ నామామృత పానములో | ఓలలాడిన హనుమంతుడే సుందరకాండలో ప్రధాన దైవము. హనుమంతు నుపాసన ఎసిన యెడల సమస్త దేవతలను సేవించిన ఫలము గలుగునని స్మృతులు పేర్కొను చున్నవి. కారణము సమస్త దేవతలలో గల శక్తి ఆయనలో అంతర్లీనమై యుండుటయే.......

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?