Logili Books

Poetry

Vandrevu Chinaveerabhadrudu Dattatreya Avadhuta Gita

By Vandrevu Chinaveerabhadrudu

₹250
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Vandrevu Chinaveerabhadrudu Dattatreya Avadhuta Gita
Publisher
Shri Pada Literary Works
ISBN
MANIMN6917
Binding
Paparback
Published Date
2026 2nd print
Number Of Pages
192
Language
Telugu
Availability
In Stock
About this book

ఆకాశంలాంటి సత్యం

ఇన్నేళ్ళు గడిచాక వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో అంతర్వాహినులుగా ఉండి నన్ను నడిపిస్తున్న ప్రభావాలు మూడు కనబడ్డాయి. ఆ కొండ కింద పల్లెలో ఆ ఇంట్లో మా బామ్మగారు నాకు చిన్నప్పుడే వినిపించి కంఠస్థం చేయించిన పోతన భాగవత పద్యాలు. రెండోది, మా నాన్నగారు ఎంతో అపురూపంగా చూసుకునే 'శ్రీమహాభక్తవిజయం' పుస్తకం, మూడోది, ఆ ఇంట్లో ఈశాన్యమూలన మా అమ్మ ప్రాణప్రదంగా చూసుకునే దేవుడి గది. ఆ దేవుడి గదిలో ఒక చిన్న చెక్కమందిరం ఉండేది. అందులో వంశ దేవీదేవతలమూర్తులు, కొన్ని పారంపర్యంగా వస్తుండే పంచాయతనంతో పాటు కొన్ని పటాలు, వ్రతకల్పాలు ఉండేవి. నా జీవితంలో అరవయ్యేళ్ళు గడిచాక ఇప్పుడు నాకు అర్థమయిందేమంటే, మా బామ్మగారి ద్వారా భగవద్భక్తి కవిత్వం, మా నాన్నగారి ద్వారా భగవద్భక్తుల జీవితాలు పరిచయమైతే మా అమ్మ ద్వారా భగవత్స్వరూపాలే పరిచయ మయ్యాయని.

ఈశాన్యమూల ఉన్నా, ఇల్లు తాటాకుతో నేసిన కప్పు కావడంతో చూరు మరీ కిందకి దిగి ఉండటంతో, ఆ దేవుడి గది దాదాపుగా చీకటిగానే ఉండేది. కాని ఆ చీకట్లోనే మా అమ్మ నాకు గొప్ప వెలుతురుని పరిచయం చేసిందని ఇన్నేళ్ళయ్యాక పోల్చుకోగలుగుతున్నాను. నా మరీ పసితనంలో, అంటే అయిదో తరగతిలోపే, నాకు చదవడం బాగా వచ్చింది కాబట్టి మా అమ్మ తాను చేసుకునే వ్రతాలకి వ్రతకల్పాలు నాతో చదివించుకునేది. అలా రామదేవుని వ్రతకల్పం, శివదేవుని వ్రతకల్పం మా అమ్మ నాతో ఎన్నిసార్లు చదివించు కుందో.

ఆ శివదేవుని వ్రతకల్పం లోపలి అట్టమీద శివపంచాక్షరీ స్తోత్రం, వెనక అట్ట మీద భ్రమరాంబికాష్టకం ఉండేవి. శ్రీశైలం ఎక్కడుందో తెలియని ఆ పసివయసులో ఆ స్తోత్రాలు పదే పదే వల్లెవేసినందుకు నా తదనంతర జీవితంలో దాదాపు ముప్ఫైఏళ్ళకు పైగా శ్రీశైలంతో అనుబంధం స్థిరపడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తూంటుంది. అలానే ఆ దేవుడి....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?