Logili Books

Novels

Veguchukka ( Janapada Navala)

By Adapa Cheranjeevi

₹175
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Veguchukka ( Janapada Navala)
Publisher
Classic Books
ISBN
MANIMN7078
Binding
Paparback
Published Date
Aug, 2026
Number Of Pages
173
Language
Telugu
Availability
In Stock
About this book

వేగుచుక్క

చంద్రగిరి కోటలో ఆకాశ హర్మ్యాలలా భాసిలుతున్నాయి ముప్పది దివ్య భవంతులు. వాటి నిర్మాణ వైభవం అద్భుతం వృత్తాకారంలో ఉన్న ఆ భవంతులను ఆవరించి ఉన్న పూలవనాలు, పూపొదరిళ్ళు, వృక్ష సముదాయం ఒక అడవిని తలపించేలా ఉన్నాయి. ఆ భవనములను ఆవరించి భువన మోహనంగా ఉద్యానవనం స్వర్గసీమను తలపించేలా ఉన్నది.

సంధ్యా సమయం కావడానికింకా ఒక గడియ సమయమున్నది. (గడియ కాలమంటే 24 నిమిషాలు).

ఆ సమయంలో ఆ ఉద్యానవనంలో నింపాదిగా నడుస్తున్నాడు మహారాజు మహేంద్ర భూపతి. ఎత్తుకు తగిన లావుతో, శరీర దారుఢ్యంతో గంభీరంగా ఉంటాడు అతడు. మలయ పవనాలు ఆహ్లాదంగా వీస్తున్నాయి. కన్నుల పండుగ చేస్తున్న పూల గుభాళింపులు మహారాజుకు మదన తాపాన్ని రేపుతున్నవి. మదిలో రేగిన సరసమైన ఊహలకు మహేంద్ర భూపతి పెదవులపై చిరునవ్వు వెలిసింది.

అదేవిధంగా విగడియలో ఒక క్రమ పద్ధతిలో దుందుభి మ్రోగడం ప్రారంభించింది. దాని ధ్వని కోటలో ప్రతిధ్వనిస్తున్నది. మహారాజు ముందుకు నడుస్తూనే పక్కనున్న భవంతలవైపు చూస్తున్నాడు. (గడియలో 60వ భాగం విగడియ కాలం)

ఆ ముప్పది భవనాల గవాక్షాల వద్ద నవనవలాడుతున్న ముప్పది మంది యవ్వన స్త్రీలు మంత్రముగ్ధల్లా నిలిచి ఉన్నారు. భూలోక అందాలను తిలకించి తరించడానికి దేవలోకం నుంచి దిగివచ్చిన దివ్యకాంతల్లా ఉన్నారా అతివలు.

ఒక్కొక్కరిని చూస్తూ ముందుకు నడుస్తున్నాడు మహారాజు మహేంద్రభూపతి. ఆ ముప్పది మంది ఆయన భార్యలు. వారిని ఏరి కోరి వివాహం చేసుకున్నాడు. వారికి సమాన గౌరవం హోదా ఇచ్చి ముప్పది దివ్య భవంతులను ఆ రాణుల కోసం ప్రత్యేకంగా నిర్మించాడు. ప్రతి రాత్రీ ఒక్కో రాణితో గడపాలన్నది ఆయన నియమం............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?