• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Vintha Vivaham

Vintha Vivaham By T S A Krishnamurty

₹ 200

ఇంక ఆలస్యం ఎందుకండీ బాబూ!!

అబ్బో ఏమి నవలండీ బాబూ... టి ఏస్సే గారు గుక్క తిప్పుకోకుండా చెప్పేయడం, నేను కళ్ళు తిప్పుకోకుండా చదివేయడం ఒక్క సారిగా జరిగిపోయాయి. ఈ నవల జంధ్యాల గారి కంట పడుంటేనా... అర్జెంట్గా రాజేంద్ర ప్రసాద్ - రజనీలతో సినిమా తీసేసే వారే కదా.

కథ ఉన్నా లేకున్నా చదివించే గుణం టి ఎస్సే రచనలలో మెండుగా ఉంటుందని నాకు తెలుసు. అయితే ఈ నవలలో చాలా మంచి కథ ఉండటమే కాకుండా చదివించే గుణం కొత్త ఎత్తుకు చేరి కొండెక్కి కూర్చుంది. కథనంలో హాస్యం ఎలా తన్నుకొచ్చిందో మచ్చుకు... కేవలం మచ్చుకు కొన్ని మీతో పంచుకుంటాను.

ఆ అమ్మాయిని చూసి కింద పడిపోయాడు అనడం మనం వినే ఉంటాం. పడిపోవడమంటే నిజంగా పడిపోవడమైతే ఎలా ఉంటుందో మల్లిక్ స్టైల్లో ఎలా చెప్పాడో ఒకసారి చూడండి...

"ఏడ్చారు. అయినా మేమేం చేసామురా. ఆ అమ్మాయిని చూడగానే అలా చొంగ కారుస్తూ కింద పడిపోవడమేనా?” అన్నాడు కాజా హుస్సేన్.

“మతి ఉండో మతి లేకో నేను పడిపోయాననుకో... ఎకాఎకిన నన్నలా పట్టుకు వచ్చేయడమేనా? ఆ అమ్మాయి ఎవరు? ఎక్కడుంటుంది? ఏం చేస్తోంది? మొదలైన వివరాలు కనుక్కోవాల్సిన పని లేదా?"

“మాయదారి మూర్ఛరోగమో మరేదైనా హార్ట్ ప్రాబ్లమో సంప్రాప్తమయిందనుకుని హడిలి చస్తూ నిన్ను ఆస్పత్రికి మోసుకుపోవడం ఆలస్యం... ఏ మందూ మాకూ లేకనే దిట్టంగా లేచి కూర్చుని ఆ సుందరాంగి చిరునామా కనుక్కోలేదని మమ్మల్నిలా రెండురోజులుగా నానా హైరానా పెడ్తున్నావా? నీవు మనిషివి కానే కాదురోయ్" అన్నాడు వర్మ మండిపోతూ.................

  • Title :Vintha Vivaham
  • Author :T S A Krishnamurty
  • Publisher :Kala Prachuranalu
  • ISBN :MANIMN6130
  • Binding :Papar Back
  • Published Date :June, 2024
  • Number Of Pages :154
  • Language :Telugu
  • Availability :instock