• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

90's Kids Musings

90's Kids Musings By Aravind A V

₹ 150

జామాకు... చింతపండు

డబ్బా కొట్టుకు వెళ్లి కొనుక్కోవాలంటే మా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. అందుకని అందరం కలిసినప్పుడు.. జామాకుల కోసం కొందరం, చింతకాయల కోసం మరికొందరం చెట్లు ఎక్కేవాళ్లం. చెట్టు మీదే పండుబడి బెల్లం రంగుల్లోకి మారుతున్న చింతకాయలను అందిన కాడికి తెంపేవాళ్ళం. చెట్టు మీదనే తీయటివి, గుజ్జుగా మారిన చింతకాయల్ని కింద ఉన్న వారిని వెక్కిరిస్తూ, ఊరిస్తూ తినేవాళ్ళం. కింద ఉన్న వాళ్ళ తిట్లు అరుపులకు కాస్త నెమ్మదిగా తలొగ్గేవాళ్ళం. బారెడు లాగుజేబుల్లోకి వాటిని తోసి జాగ్రత్తగా దిగేవాళ్ళం. అప్పట్లో తండాలో ప్రతి ఇంటి ముందు నాలుగు అడుగుల ఎత్తులో కూర్చుని రుబ్బుకునే వీలుండే పెద్దరోళ్లు ఉండేవి. నీళ్లు తెచ్చి రోలుని జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు ఓసీడీ ఉన్న నిపుణుల పర్యవేక్షణలో కడిగేవాళ్లం. క్లాత్తో తుడిచేవాళ్ళం. తెంపిన చింతకాయల్ని పైపొట్టు తీసి లోపలి చింతపండుని జాగ్రత్తగా ముద్ద చేసేవాళ్లం. గింజల్ని తీసి పక్కకు పోగు చేసేవాళ్లం. తీసిన బంగారు వర్ణపు గుజ్జులో ఉప్పు వేసి కసాబిసా దంచేవాళ్లం. ఆ దంచిన ముద్దను గోటీల సైజులో అరచేతుల్లో పెట్టి రౌండే షేప్ వచ్చేలాగా ఆడించేవాళ్లం. అలా ఎంతమంది ఉన్నామో ఒక్కొక్కరికి నాలుగు చొప్పున వచ్చేలాగా కడిగి పెట్టిన జామాకుల్లో ఆ ముద్దలని పెట్టేది. ఎవరి వాటా వాళ్లకు పంచేది. మరి కొన్నిసార్లు...................

  • Title :90's Kids Musings
  • Author :Aravind A V
  • Publisher :Aju Publications
  • ISBN :MANIMN6886
  • Binding :Paparback
  • Published Date :2026
  • Number Of Pages :139
  • Language :Telugu
  • Availability :instock