₹ 70
పర్షియా ! అతి పురాతన రాజ్యాల్లో ఒకటి. యూరప్ ఖండంలో ఎన్నో ప్రాచీన రాజ్యాలు, పట్టణాలు వున్నాయి. అలాంటి వాటిలో పర్షియారాజ్యం ఒకటి. ఎటు చూసినా అద్భుతమయిన శిల్పప్రాకారాలతో, అద్భుతమైన కుడ్యాలతో, సహజ సిద్దమయిన ఉద్యానవనాలతో పర్షియా రాజ్యం అలరారుతోంది.
పర్షియా రాజ్యంలో వున్న ముఖ్యమైన పెద్ద పెద్ద పట్టణాలలో హారవాన్ ప్రాచీనమైనది. అది ఎంత పెద్దపట్టణమైనా అక్కడ ఎటు చూసినా పల్లెటూరి వాతావరణం కొట్టొచ్చినట్లు కానవస్తుంది. సంవత్సరాలు గడుస్తున్నా ఆ సుందర దృశ్యాలు అలాగే నిలిచి ఉన్నాయి.
హారవాన్ లో బజారు ప్రాంతం ఎప్పుడు జనంతో కిక్కిరిసి వుంటుంది. అక్కడ వున్న తోళ్ళ వ్యాపారంలో ఓ మహమ్మదీయ వ్యాపారి వుండేవాడు. అతని పేరు సలీం బాబా. వయసులో వుండగా అతని వ్యాపారం గొప్పగా సాగినా కాలక్రమేణా తోళ్ళ వ్యాపారంలో వూపు తగ్గిపోయింది.
- Title :Alibaba 40 Dongalu
- Author :N S Nagireddy
- Publisher :Brilliant Books
- ISBN :MANIMN1252
- Binding :Paperback
- Published Date :2018
- Number Of Pages :112
- Language :Telugu
- Availability :instock