• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Ananta Karuvu Inupa Gajjela Talli

Ananta Karuvu Inupa Gajjela Talli By P Umadevi

₹ 100

1. అనంతపురం జిల్లా - నేపథ్యం

 

భౌగోళిక పరిస్థితులు :

అనంతపురం జిల్లా 13°30' మరియు 15°15′ అక్షాంశాల మధ్యన, మరియు 76°50' మరియు 78°30′ దీర్ఘాంశాల మధ్యలో ఉన్నది.

19,130 చ.కి.మీ. వైశాల్యంగల అనంతపురం జిల్లాకు ఉత్తరాన కర్నూలు జిల్లా, దక్షిణాన చిత్తూరు జిల్లా, పశ్చిమాన కర్నాటక రాష్ట్రం, తూర్పున కడప జిల్లా సరిహద్దులుగా వున్నాయి. ఈ జిల్లాలో 2001 లెక్కల ప్రకారం 36,39,304 మంది జనాభా. అక్షరాస్యత 56.69 శాతం. ఇంత విశాలమైన అనంతపురం జిల్లాలో జనసాంద్రత కిలోమీటరుకు 190 మాత్రమే వుండడం ఒక విచిత్రం. ఇందుకు కారణం ఈ జిల్లాను పట్టిపీడిస్తున్న కరువు కాటకాలే.

జిల్లాలో నైఋతి దిక్కున మడకశిర-హిందూపురం, సముద్రమట్టానికి 670 మీ ఎత్తున ఉంటూ ఈశాన్యంవైపుకు ఎత్తు తగ్గుతూ, తాడిపత్రికి చేరేసరికి సముద్రమట్టానికి 274మీ ఎత్తులో ఉన్నది. అంటే నైఋతిమూలనుండి ఈశాన్యం మూలకు వాలుగా ఉన్నది. ఆగ్నేయానికి కదిరి, వాయువ్యానికి ఉరవకొండ మండలాలు, తూర్పునకు తాడిమర్రి, నార్పల మండలాలు, పశ్చిమాన కళ్యాణదుర్గం అంతర సరిహద్దులుగా ఉన్నాయి. వర్షపాతం:

ఇది పూర్తిగా కరువు జిల్లా. సాధారణ సంవత్సరంలో వర్షపాతం సగటున 520.0 మి.మీ. అయితే ఇది లెక్కల్లో మాత్రమే. ఈ సగటు వర్షపాతానికి చాలా తక్కువగా ఈమధ్య సంవత్సరాల్లో నమోదు అవుతున్నది. నైఋతి ఋతుపవనాల వలన 310.8 మి.మీ. (60%) ఈశాన్య ఋతుపవనాల వలన 147 మి.మీ. వర్షపాతం నమోదు.....................

  • Title :Ananta Karuvu Inupa Gajjela Talli
  • Author :P Umadevi
  • Publisher :Vishalandra Publishing Housing
  • ISBN :MANIMN4611
  • Binding :Papar back
  • Published Date :July, 2023
  • Number Of Pages :127
  • Language :Telugu
  • Availability :instock