20 వ శతాబ్దంలో అత్యున్నత నవలలో మొదటి పదిలో ఒకటిగా భావించబడుతున్న నవల ఆల్బర్ట్ కాము వ్రాసిన ది అవుట్ సైడర్ (ది స్ట్రేంజర్) అమ్మ ఈ రోజు చనిపోయింది లేదా నిన్నయినా కావచ్చు అనే ఒక అసందిగ్ధ వాక్యంతో మొదలయ్యే ఈ నవల మొదలు పెట్టిన తరువాత చివరికి వచ్చేంత వరకు ఏకబిగిన చదివింప జేస్తుంది. అంతర్జాతీయంగా అఖండ కీర్తి నార్జించిన నవలకు జి.లక్ష్మిగారు తెలుగు సేత. ఇంగ్లీష్ నవల ఎంతగా మనల్ని అలరిస్తుందో అంత అందంగానూ ఆమె భాష సాగింది. ఇంగ్లీష్ పుస్తకం చదివినా చదవక పోయినా దీనిని తప్పక చదవాలి.