• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Ayaskantha Chikitsa

Ayaskantha Chikitsa By Dr Dhiren Gala

₹ 50

1వ భాగము : ఉపోద్ఘాతము
 

అయస్కాంత చికిత్స యొక్క సిద్ధాంతము

 

మనకందరకు చిరపరిచితమైన అలోపతి వైద్యం తీవ్రవ్యాధులకునూ, అత్యవసర పరిస్థితులలోనూ ఎంతో ఉపయోగ పడుతుంది. అలోపతి మందులు తీవ్రలక్షణాలను, నొప్పులను త్వరగా తగ్గిస్తాయి. అంతేగాక, ఆధునిక శస్త్రచికిత్స ఎన్నో ప్రాణాలను కాపాడుతోంది. కాని, వస్తుతః రోగలక్షణపరమైన ఉపశమనాన్నిచ్చే అలోపతి మందులను దీర్ఘకాలిక వ్యాధులకు చాలా రోజులు వాడుట వలన ఇతర ఇబ్బందులు (సైడ్ ఎఫెక్ట్స్) వచ్చే ప్రమాదముంది. మామూలు వ్యాధులకంటే, మందుల వలన వచ్చే ఈ క్రొత్త జబ్బులకు (ఇతర ఇబ్బందులకు) చికిత్స కష్టమైనది.

తలిడోమైడ్, పెన్సిలిన్, కోర్టికోస్టెరాయిడ్స్ వగైరా మందులను కనుగొన్నప్పుడు, వాటి గుణగణాల ప్రచారంతో ఎన్నో ఆశలను రేకెత్తించాయి. కాని, వాటి వాడకం వలన వచ్చిన తీవ్రమైన ఇతర ఇబ్బందుల వలన జనంలో ఉత్సాహం సన్నగిల్లింది. (ఈ క్రింది చిత్రం చూడండి).

ఈ పరిస్థితులలో మందులతో ప్రమేయంలేని అయస్కాంత చికిత్స, ఆక్యుప్రెషర్, ఆక్యుపంచర్, యోగా, ప్రకృతి చికిత్స వగైరాలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ చికిత్సలు సులువైనవి, ఫలవంతమైనవి, ఇతర ఇబ్బందులు లేనివి. కనుక వీటికి జనాదరణ బాగా పెరుగుతోంది.

ప్రకృతిలో ఉన్న శక్తులలో అయస్కాంతత్వము (మేగ్నెటిజం) అతి ముఖ్యమైనదని చెప్పవచ్చును. ప్రకృతిసిద్ధ అయస్కాంతత్వము సర్వ జీవకోటి మనుగడకు మూలాధార మని భౌతిక శాస్త్రజ్ఞులు, జీవశాస్త్రజ్ఞులు అంగీకరించారు. ఈ సిద్ధాంతాన్నే ఆధారంగా చేసుకొని, కృత్రిమ అయస్కాంతాలు వైద్యసాధనాలుగా గల క్రొత్తరకం చికిత్సావిధానం రూపొందింపబడింది.

భూమి ఒక పెద్ద అయస్కాంతము. దానికొక అయస్కాంత క్షేత్రమున్నది. అలాగే అంతరిక్షంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు ఇత్యాది గోళాలన్నిటికి తమతమ స్వంత..............................

  • Title :Ayaskantha Chikitsa
  • Author :Dr Dhiren Gala
  • Publisher :Navneet ( India ) ltd
  • ISBN :MANIMN6258
  • Binding :Papar Back
  • Published Date :2009
  • Number Of Pages :118
  • Language :Telugu
  • Availability :outofstock