• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Ayudham Lanti Manishi

Ayudham Lanti Manishi By Losari Sudhakar

₹ 150

మన మనీషి

ఆయుధాలు లేని మనుషులు ఉండొచ్చు; మనుషులు లేకుండా ఆయుధాలూ ఉండొచ్చు. మనిషి లేని ఆయుధం శవం చేతిలో కత్తిలాంటిది. ఆయుధాన్ని సృష్టించేది మనిషే, ఉపయోగించేదీ మనిషే... అది నవసృష్టికైనా, ధ్వంసరచనకైనా... మరి మనిషే ఆయుధంగా మారితే? మనిషి, ఆయుధం లాంటి మనిషైతే? ప్రశ్న చాలా తేలిగ్గా ఉంది కదూ!

మిత్రమా! జవాబే అతికష్టం... వ్రాత కఠినం. నేను కవితల్ని విశ్లేషించను. ఎందుకంటే, అన్ని పంక్తులూ అద్భుతమైనవే. ఇవి అసలుసిసలైన కవితలు. కన్నీటివిలువ తెలిసిన కవితలు. ఆశయాలకీ ఆచరణకీ మధ్య ఉన్న దూరం ఎంతో స్పష్టంగా తెలిసిన కవితలు.

చిరంజీవి లోసారి సుధాకర్ నా బిడ్డ. ఇద్దరిదీ యూనిఫాం పుట్టుకే. మనిషిలో మనిషితత్వం కంటే మానవత్వం పాలు ఎక్కువైతే ఏమవుతాడూ? ఆ మనిషి ఏం చేస్తాడూ?

ఆ మనిషి లోసారి సుధాకర్ అవుతాడు. వెక్కెక్కి ఏడుస్తాడు. నవ్వు రాకపోయినా నవ్వుతాడు. బాధపడతాడు. తనలో తానే కుమిలిపోతాడు. నీ కోసం, నా కోసం, మన కోసం అక్షరాల్ని సాహితీ సముద్రంలోంచి ముత్యాల్లా వెలికితీస్తాడు. వాటిని పదాలుగా, కవితలుగా కూర్చి మనముందు నిశ్శబ్ధంగా వాటిని 'బొత్తి'గా పెట్టేసి సైలెంటుగా ఒంటరిగా వెళ్ళిపోతాడు.

ఒకటి మాత్రం నిజం... కొన్ని వేల ఆవేశాల్నీ, ఆలోచనల్నీ, నిట్టూర్పుల్నీ మన దగ్గరే వదిలేసి వెళ్ళిపోతాడు. అవి మాత్రం మన గుండె గ్రంథాలయంలో భద్రంగా ఉంటాయి.. ఇదిగో... అచ్చు యీ 'ఆయుధంలాంటి మనిషిలాగా.....................

  • Title :Ayudham Lanti Manishi
  • Author :Losari Sudhakar
  • Publisher :Sahiti Mitrulu, Vijayawada
  • ISBN :MANIMN6250
  • Binding :Papar Back
  • Published Date :March, 2025
  • Number Of Pages :151
  • Language :Telugu
  • Availability :instock