• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Azeez Kathalu

Azeez Kathalu By S D V Azeez

₹ 400

ఎర్రకాగితాలు

గుడిసెలోనికి సూరీడు తొంగిచూస్తున్నాడు. ఎలుకలు బొద్దింకలు ఆ గుడిసెలో నివాసమేర్పరచుకొన్నాయి. గుడిసెకు కప్పిన తాటియాకులు పొగచూరి నల్లగా కనిపిస్తున్నాయి. గుడిసెకు మధ్యలో నుంచి ఓ తుప్పుపట్టిన లాంతరు వేలాడుతూ వుంది. దానికి జానెడు ఎత్తున మసి పేరుకొని వుంది.

పొయ్యిమీద ఉన్న మట్టి కుండలు ఖాళీగా ఆశగా చూస్తున్నాయి. ఆ కుండల క్రింద పిల్లి వెచ్చగా పడుకొని కలలు కంటోంది. కుక్కిపోయిన మంచెం మీద ఎముకల గూడులా వున్న ఓ ముసలాడు పడుకొని ఖంగ్... ఖంగ్.... మంటూ దగ్గుతున్నాడు. నోటికొచ్చిన కఫమంతా తన పక్కనే ఉమ్ముకొంటున్నాడు లేచి ఉమ్మడానికి కూడా అతనికి శక్తి చాలడంలేదు.

చింపిరి తలలతో చినిగిన బట్టలతో ముక్కులో చీమిడి కారుతూ వొళ్ళంతా దుమ్ము కొట్టుకొని అసహ్యంగా ఉన్నారు ఇద్దరు పిల్లలు. వారి కళ్లు బయటికి చూస్తున్నాయి. వారి కడుపులో ఆకలి సప్తస్వరాలు పలుకుతోంది. చిల్లులు పడిన సత్తు గిన్నెలు తీసుకొని గిన్నెవైపు, వీధివైపు మాటిమాటికి చూస్తున్నారు.

“అమ్మ ఎప్పుడొత్తాది తాతా!” అన్నాడు ఆరేండ్ల చంటిగాడు. “ఆకలేత్తుంది తాతా!” అన్నాడు ఎనిమిదేండ్ల ఈరిగాడు.

"ఉండండిరా! ఎదవనాయళ్ళారా! ఎప్పుడు ఆకలే! దొంగనాకొడుకులకు” అన్నాడు తాత కష్టంగా మాట పెగల్చుకొని. అంతలోనే అతనికి దగ్గుపొర వచ్చింది. ఖంగ్... ఖంగ్... మంటూ దగ్గుతూ మంచినీళ్ళ కోసం నీరసంగా లేచాడు.

“రేయ్ చంటీ! తాతకు దగ్గొచ్చింది నీల్లియ్యి!" అన్నాడు ఈరిగాడు. మూతలేని కుండలోనుంచి సిల్వర్ గ్లాసులో చంటిగాడు నీళ్ళు తెచ్చి ఇచ్చాడు. దాని నిండా మురికి వుంది. అయినా అది ముసలాడికి ఏమీ కన్పించలేదు. ఆతృతగా గడగడ తాగేశాడు. చిల్లులు పడిన గ్లాసులోనుంచి సగం నీళ్లు కిందనే పోయాయి. ఇప్పుడు ముసలాడి ప్రాణం కొంచెం కుదుటబడింది............................

  • Title :Azeez Kathalu
  • Author :S D V Azeez
  • Publisher :S D V Azeez
  • ISBN :MANIMN6435
  • Binding :Papar Back
  • Published Date :2024
  • Number Of Pages :361
  • Language :Telugu
  • Availability :instock