• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Babuji
₹ 150

బాబూజి

అది సద్గురు వెలిగించిన దీపం. అలా అయి అదొక నందా దీపం. అలాంటి దీపం వెలిగేది మనుష్యుల అంతరంగంలో. ఈ సంగతి అర్థం చేసుకోని 'మేధావంతులన్న' కొందరు శిష్యులు గురువుగారిని ప్రశ్నించనారంభించారు. 'గురువుగారూ, మీ కలను నిజం చేసేటటువంటి, మీరు ప్రారంభించిన ఈ వినూతనమైన అధ్యాత్మిక క్రాంతిని పటిష్ఠం చేసి దీని వ్యాప్తిని విస్తరించగల, తమ ఈ నూతన సాధన పద్ధతిని చిరస్థాయి చేయగలిగే ఉత్తరాధికారిని తమరు యింతవరకు సూచించ లేదు కదా?'

పైకి చూడడానికి ఇది సరియైన విషయమైనా వారి మనసులలో కలిగి నర్తిస్తున్న ప్రశ్న ఇలా వుండినది: 'ఎవరు వెలిగించితే ఏమిటి? దీపం దీపమే! అది వెలిగే కాలం పరిమితం. అది మనకు తెలియకుండానే ఆరిపోతుంది. అపుడు'? శిష్యుల మనసులలో వున్న సంగతి గురువుగారికి తెలియనిదేమీ కాదు.

గురువు నవ్వుతూ అన్నారు: 'దీపం వెలుగుతూంటుంది. దీపం పురుగులు తమకు తామై ఆ దీపం చుట్టూ తిరుగడానికి వచ్చితీరుతాయి'.

'దీపం వేడికి ఆహుతి కావాలనే వస్తాయి, పాపం'! అని అనాలని తలచారు కొందర

'అలా ఏమైనా అవి దీపం చుట్టూ తిరగడానికి వచ్చినా ఈ ఘోర పరిణామాల నుండి తప్పించుకోవడానికి వాటికి సాధ్యమా? దాని అత్యం చాలా సహజం' ఇలా

తలచాడు ఒక అనుయాయి.

ఇది గ్రహించినవాడిలా గురు మహారాజ్ మరలా అన్నారు. 'చూడండి, నా ఆలోచన యిలా వున్నది. నేను అనుకొన్నట్టు అలా వచ్చే దీపపు పురుగు వెలుగున్నపుడూ వస్తుంది. దీపం ఆరిపోయి కొడి కట్టినపుడు కూడ వస్తుంది. అది వచ్చి తీరుతుంది......................

  • Title :Babuji
  • Author :Veluri Krishna Murty
  • Publisher :Pala Pitta Books Hyd
  • ISBN :MANIMN6301
  • Binding :Papar Back
  • Published Date :Oct, 2024
  • Number Of Pages :139
  • Language :Telugu
  • Availability :instock