₹ 200
చూసే పనిని చేసేది కన్ను... ఆ అవయవం పని అదే గనుక. అయితే, ఆ అవయవాన్ని పనిచేయించేది మనస్సు. మనస్సు చూడమన్నదాన్నే కన్ను చూస్తుంది. అలా చూసిందే మనసులో చోటుచేసుకొంటుంది. మనసు ప్రమేయం లేకుండా కళ్లు చూసేవాటికి ఆ మనసులో చోటుండదు.
ఆ మనస్సు ఆలోచిస్తుంది, ఆవేదన చెందుతుంది. ఆనందిస్తుంది. అంతుచిక్కనంత ఆలోచనల్లోకి జారిపోతుంది. ఆలోచనల్లోంచి, అధ్యయనంలోంచి, అనుభవాల్లోంచి వచ్చిన నవనీతాన్ని తనదైన నుడిలో, నుడికారంలో వెల్లడిస్తుంది. నుడి (భాష) దీనికంతా సాధనం. అదే మనిషి ప్రత్యేకత. 'నుడి' లేని మనిషికి మనిషిగా మనుగడ ఉండదు.
కనుక మనిషి ఉనికికి కీలకం భాష. ప్రాణం భాష, బతుకంతా భాషతోనే.
ప్రపంచంలో ఎన్నో భౌగోళిక ప్రాంతాల్లో మానవ సమూహాలు వికసించిన క్రమంలో సహజంగానే అవి తమ తమ స్వంత భాషలనూ పెంపొందించుకొన్నాయి. అందువల్ల ఆ సమూహాలు భాషాజాతులుగా గుర్తింపుకొచ్చాయి.
- జయధీర్ తిరుమలరావు
- Title :Bhashavaranam
- Author :Jayadhir Thirumala Rao
- Publisher :Sahithi Publications
- ISBN :MANIMN0465
- Binding :Paperback
- Published Date :2017
- Number Of Pages :289
- Language :Telugu
- Availability :instock