• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Bhavayami

Bhavayami By Prabhakar Aripaka

₹ 175

మనసుని కదిలించిన కథలు కాదు... జీవితాలు

ప్రభాకర్ ఆరిపాక కథలన్నిటిలోనూ ఏదో ఒక అంశంతో మనం ఐడెంటిఫై అవుతాం కారణం...

అవి కథలు కాదు...! వాటిది జీవితమంతా కాన్వాస్ కాబట్టి...!!

బతుకు కెలిడియ స్కోప్లో నుంచి చూసినప్పుడు జీవితంలోని ఎన్నో రంగు రంగుల పార్శ్వాలు (ఆకలి... అవమానం...., ఆవేశంలా ఎర్రగా..., ఆవేదన ఆక్రందనల నల్లగా... ఇలా ఎన్నో రంగులు) మనకు కనపడి బ్లాక్ అండ్ వైట్ బ్రతుకుల్లోని రకరకాల భావోద్వేగాల రంగుల్ని ఆవిష్కరిస్తాయి.

వాటిని ఒడిసిపెట్టి తనదైన పరిశీలనతో అవగాహనతో కథలుగా మలచి మనకు అందించాడి రచయిత.

నచ్చిన వాటిని కొన్ని ఎంచుకొని నాలుగు మాటలు రాయాలంటే అది కష్టమైన ప్రక్రియ... క్లిష్టమైన బాధ్యత....

పండిన కుంకుమ పూల చేలోకి వెళ్లి నచ్చిన నాలుగు పూలు కోసుకోమంటే ఎంత కష్టమో అంత కష్టం అయినా ఆ పని చేయగలిగాను సుమీ.

'మళ్ళీ పుట్టొద్దు మాస్టారు' ఈ కథలోని మాస్టారు వాత్సల్యం మాష్టారి పట్ల పిల్లల అనిర్వచనీయ బంధం... ప్రేమ... మన హృదయాన్ని కదిలిస్తాయి. అప్పటి తరంలోని నిష్కల్మష, నిస్వార్ధ, నిర్మల గురుశిష్య బంధాలకు అద్దం పడుతుందీ కథ. రిటైర్ అయిన మాస్టారు మళ్ళీ ఓ ప్రైవేట్ స్కూల్లో చేరి మారిన తరంలోని పిల్లల.........................

  • Title :Bhavayami
  • Author :Prabhakar Aripaka
  • Publisher :Anvikshiki Publishers
  • ISBN :MANIMN6264
  • Binding :Papar Back
  • Published Date :2025
  • Number Of Pages :140
  • Language :Telugu
  • Availability :instock