• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Biddala Shikshana Sahityam Navalalu

Biddala Shikshana Sahityam Navalalu By Chalam

₹ 160

ముందుమాట

చలంగారి రచనలన్నీ ఒక ఎత్తుగా, ఈ 'బిడ్డల శిక్షణ' వొక్కటీ వొక ఎత్తుగా తోస్తుంది నాకు.

“బిడ్డల శిక్షణ” నీ, “స్త్రీ” నీ, చెప్పకుండా చలాన్ని చెప్పడం సాధ్యంకాదు.

స్త్రీల సమస్యల గురించి హృదయపూర్వకమైన సానుభూతితో చర్చించిన వారూ, స్త్రీల పరిస్థితులకు అమితంగా బాధపడినవారూ ఇంకా కొందరు రచయితలు ఉన్నారు మనకు. కానీ బిడ్డల్ని గురించి ఇంత ప్రేమతో, దయతో, బాధ్యతతో చర్చించిన వారు మాత్రం చలం వొక్కరే! ఆయన చెప్పిన మాటల సారాంశం అంతా బిడ్డల్ని నిజమైన శ్రద్ధతో, ప్రేమతో, జ్ఞానవంతంగా పెంచాలన్నదే.

చలం ఈ రచన చేసిన నాటికీ నేటికీ, బిడ్డల్ని పెంచుతున్న పరిస్థితుల్లో చెప్పుకోదగ్గ మార్పేమీ లేదు. ఇల్లే కాదు; బడీ, ఇతర సమాజమూ కూడా పిల్లల విషయంలో ఆరోగ్యవంతంగా ఆలోచించడం లేదు. ఈ స్థితిని ఎలా సరిదిద్దుకోవాలో చలంగారు సాధ్యమైనన్ని విధాల చెప్పారు.

“ఆఁ, ఏదో చదవడానికి బాగానే వుంటాయి ఇలాంటి పుస్తకాలు. అలాగే చెయ్యడానికి కుదురుతుందా?” అని కొట్టి పారేసే వాళ్ళున్నారు, కనీసపు ప్రయత్నాలైనా చెయ్యకుండా.

“చలం చెప్పినట్టే తిట్టకుండా, కొట్టకుండా పెంచాం. పిల్లలు కోతులై పోయారు. ఇక తన్నడం తప్పలేదు” అనో,

"చలం చెప్పినట్టు పెంచాలనుకున్నారా? అదంతా తప్పని తెలిసొచ్చిం దిగా? చలాన్ని అతని తండ్రి బాగా తన్ని పెంచబట్టే అంత వాడయ్యాడండీ. ఆ సంగతి ఆయన గ్రహించలేదు గానీ" అనో, చలం చెప్పిన దాన్ని అబద్ధం చెయ్యాలని కంకణం కట్టుకున్న పెద్దలూ మేధావులూ తటస్థ పడుతూనే వున్నారు.........................

  • Title :Biddala Shikshana Sahityam Navalalu
  • Author :Chalam
  • Publisher :Amaravti Publications
  • ISBN :MANIMN6314
  • Binding :Papar Back
  • Published Date :May, 2025
  • Number Of Pages :169
  • Language :Telugu
  • Availability :instock