టక్కరి తోడేలు
అనగా అనగా పూర్వం ఒక అడవి పక్కన ఉన్న గ్రామంలో రాజయ్య, గంగమ్మ అనే భార్యాభర్తలు రక్ష ఉండేవారు. వారికి వెంకట్ అనే ఆరు సంవత్సరాల కొడుకు ఉన్నాడు. వెంకట్ తండ్రి రోజు కూలి పనికి సమీపంలో ఉన్న మరో గ్రామంలో పనికి వెళ్లేవాడు. తిరిగి సాయంత్రం తిరిగి వస్తూ ఉండేవాడు. వెంకట్ తండ్రి కూలికి వెళ్లే ముందు తన అబ్బాయితో "బాబు మేము లేనప్పుడు అడవిలోకి పోవద్దు. అక్కడ టక్కరి క్వం తోడేలు ఉన్నది. అది నిన్ను కరచి తినేయగలదు.” వెంకట్ సరేనని తలూపాడు .
వెంకట్ తండ్రి కూలికి వెళ్ళిన తర్వాత వెంకట్ తల్లి వెంకట్తో 'నేను కూడా పని వెతుకుటకు తూ బయటకు వెళుతున్నాను. నీవు ఇంట్లో ఉండి ఆడుకో. నేను త్వరగా వెళ్లి వస్తాను" అని చెప్పి వెళ్ళిపోయింది.
వెంకట్కు ఎన్నాళ్ళ నుంచో అడవిలోకి పోవాలని ఉంది. అక్కడ తియ్యని, కమ్మని జాం కాయలు తినాలని ఉంది. వెంటనే “చందమామ రావే జామపండు ఇవ్వవే. చందమామ రావే జామపండు ఇవ్వవే" అని పాడుకుంటూ అడవిలోకి బయలుదేరాడు.
అలా పాడుకుంటూ కొంతదూరం అడవిలోకి వెంకట్ వెళ్ళాడు. అతనికి జామ కాయ చెట్టు కనిపించింది. ఆ చెట్టుకు మంచిగా పండిన జామకాయలు ఉన్నాయి. వెంటనే జామకాయలు కోసుకొని తినసాగాడు. అంతలో అక్కడికి తోడేలు హఠాత్తుగా వచ్చింది. “ఓ అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నావు?" అని అడిగింది. వెంకట్ భయపడి తేరుకున్నాడు. “లేదు లేదు నేను ఎక్కడికి వెళ్లడంలేదు. జామకాయలు కోసి తినుటకై ఇక్కడికి వచ్చాను" అన్నాడు...........................