దేహ నాగరలిపి చెక్కి వెళ్ళిన కథలకి...
జ్ఞాన స్పృహలకి ఆవల విరుద్ద ఆవాహనల ముట్టడి... ప్రమత్తత లేని నైరాశ్య శూన్యంలో దేహం తల మునకలవుతూ చీకట్లో తప్పి పోయిన పలవరింతలో చెప్పుకొన్న కథలు.
కథ - ఓ నిద్ర ప్రయాస... మాయా నిశ్చింత గరగరలాడినప్పుడు చుట్టుకొన్న గొంతు నొప్పి... పురాతనమూ... గత ముద్రలేని వివిధ రంగులు పులకింత కమ్ముకొన్న దుఃఖం ఒక్కోసారి రెండో నగరపు చరియల్ని కూల్చి... గావించుకొంటూ పోయిన స్వాధీన సత్తువల్ని సరి చేసాక... మసక ఝాములో తన ఇంటిలోంచి మొదలయ్యే దేహ నాగరలిపి కథలు...
మింగిన చేదుమాత్రలు విసిరిన మత్తులో... భావిలోంచి తోడిన స్నానశిల రాత్రంతా చెవిలో చెప్పిన కథల కలే.. గుబులు పట్టిన ఇల్లు తన బట్టలని మార్చుకొని దేహానికి కొత్త రంగు పట్టిస్తుంది.
లోపల లోపలనే తిరుగుతూ ఖాళీ నవ్వుల్ని కూల్చిన భయాలు. నిద్ర రంగుల్లోంచి దూరం జరిగాక స్పష్టమయ్యే మాటలు... శబ్దం అక్కరలేని మాటలతో చీకటి ముసురు సర్దుకొన్న జ్ఞాన పూర్వంగా మార్చే ఘటనల్ని తనకి వదిలిపెట్టి మాయమవుతుంది.
ఏదీ అనుకొని రాదు. అనుకోకుండా ఉండిపోదు. బలంగా అనుకొన్నది జరుగుతున్నప్పుడు కథ పెదవి విరిచి పాలిన చూపుతో తెలియని చోటుని తుడుచుకొని నిద్రపోతుంది. నిద్ర గోపురాన్ని బూజు పట్టిన కొవ్వెత్తులతో వెలిగించారు. కాని చిత్రం... కథ గమ్యంగా ఉండని పెద్ద కేక నిద్రకి ముందే మోసగించబడింది.
* * *
మైల పట్టిన కలలు స్నానం చేస్తూన్నప్పుడు దుఃఖ నిలకడ లేని అపూర్వ పాదాన్ని నది కౌగలించుకొన్నాక మహా నిట్టూర్పులో... స్ఖలన మగతలుగా కమ్మిన దేహ................