₹ 250
ఇప్పుడు విశ్వనగరకత, సభ్యసమాజం ముఖ్యంగా పరిపాలన వ్యవస్థ మనదేశాంలో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రగతిపధంలో పయనిస్తున్నదా, అధోగతి వైపు అంగలు సారిస్తున్నదా!! అన్న విచికిత్స కలిగినప్పుడు హృదయ స్పందనగల వ్యక్తి సంక్షోభం పొందకతప్పదు. ప్రపంచ దేశాలలో ఇప్పుడు ఎక్కడ చూసినా కృతయుగం కనపడదు. దానిని రూపొందించుకోవాలన్న ప్రయత్నమూ కనపడదు. వికృతయుగం నెలకొనటానికి ఎన్నో ప్రయత్నాలు మాత్రం కనపడుతున్నాయి.
ఇందుకు కారణం ఈ భూమి మీద ఇప్పుడు ఏ ఒక్క దేశము ఇతర దేశాలకు సంబంధం లేకుండా సముద్రాద్విపంలాగా మనుగడ సాగించలేకపోవటమే . భోగోళికమైన దూరాలు ఎంత తరిగిపోయి, కరిగిపోయి భౌతికంగా ఎంత దగ్గరవుతున్నాయో, మనుషులు మాత్రం ఆంతకంతకు ఒకరికొకరు దూరమైపోతున్నారు. దీనులైపోతున్నారు. ఇటువంటిది జరగకుండా ఉండటానికి గౌతమబుద్ధుడు బోధించిన సరళజీవన ప్రవృతి మార్గమే రక్షకము, సంరక్షకము అనిపిస్తున్నది.
- Title :Dhammapadam Gathalu
- Author :Akkiraju Ramapathi Rao
- Publisher :Dharmadeepam Foundations
- ISBN :MANIMN1120
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :340
- Language :Telugu
- Availability :instock