₹ 120
శరశ్చంద్ర తర్వాత తెలుగు పాఠకులకు అత్యంత ఆప్తుడైన బెంగాలీ రచయిత బిభూతిభూషన్ బందోపాధ్యాయ. పథేర్ పాంచాలి, అపరాజితుడు వనవాసి వంటి బిభూతిభూషన్ బందోపాధ్యాయ నవలలెన్నింటినో తెలుగు పాఠకులు ఆదరించారు. ఆస్వాదించారు. ఆ కోవలోనే హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ద్వారా తెలుగు పాఠకులకు అందుతున్న మరో అద్భుత రచన దురాంతరం... ఒక వ్యక్తి చుట్టూ అల్లుకున్న ముగ్గురు అతివల కథ. జమిందారీ కుటుంబానికి చెందిన మహిళ ఒకరు కాగా సాంప్రదాయ బ్రహ్మణ్యాన్ని పాటించే మహిళలు మరో ఇద్దరు. చదువు పాడు చేసుకుని బాల్యం వృధా చేసుకుని యవ్వనాన్ని దుర్వ్యసనాలకు అంకితమిచ్చి బతుకు నేర్పిన పాఠాలతో కొత్త జీవితాన్ని వెతుక్కునే క్రమంలో కథా నాయకుడు పడిన ఆత్మ సంఘర్షణే ఈ నవల.
- Title :Duraantharam
- Author :Dandamudi Mahidhar
- Publisher :Hyderabad Books Trust
- ISBN :MANIMN2093
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :107
- Language :Telugu
- Availability :instock