Logili Books

Sociology

Epstein Files

By Krishna Kanuri

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Epstein Files
Publisher
Praja Shakthi Book House
ISBN
MANIMN7070
Binding
Paparback
Published Date
July, 2026
Number Of Pages
199
Language
Telugu
Availability
In Stock
About this book

పెట్టుబడిదారీ వ్యవస్థ నైతిక పతనానికి నిదర్శనం

చెట్టు ముదిరిపోయి చనిపోవడానికి వచ్చినప్పుడు దానికి కుక్కమూతి పిందెలు పుడతాయంటారు. తిరగేసి చెబితే చెట్టుకు కుక్కమూతి పిందెలు పుట్టాయంటే అర్ధం ఆ చెట్టు చనిపోయే స్థితికి వచ్చిందన్నమాటే. కుక్కమూతి పిందెలు చెట్టు మొదళ్లలో కుళ్లిపోయిందని చెప్పే సూచనలు మాత్రమే.

ప్రస్తుతం ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా మూలం నుండి కుళ్లిపోతున్నదనీ, అది పెద్ద వ్యవస్థాగత సంక్షోభంలో చిక్కుకున్నదనీ ఆర్థిక నిపుణలు చెబుతున్నారు. అందువల్ల కుళ్లిపోతున్న ఈ వ్యవస్థకు కుక్కమూతి పిందెలు పుట్టడం సహజమే. పెట్టుబడిదారీ అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాకు అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మాటలు, చేతలు, యుద్ధ విన్యాసాలు చూసినా, ప్రపంచ వ్యాపితంగా పెట్టుబడిదారీ దేశాల్లో తలెత్తుతున్న జాతివివక్ష, వలస వ్యతిరేక ఉన్మాదం, మతోన్మాదం తదితర నయా-ఫాసిస్టు పోకడలు చూసినా మనకు కుళ్లిపోయిన వ్యవస్థకు పుట్టిన కుక్కమూతి పిందెలే గుర్తుకొస్తాయి. ఇటీవల అమెరికాలో బయటపడిన ఎన్ ఫైల్స్ పెట్టుబడిదారీ వ్యవస్థ ఎంతగా కుళ్లి కంపుకొడుతున్నదో మనకు పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది.

జెఫ్రీ ఎన్ అనే పచ్చి నేరస్తుని ఫైల్స్... ప్రపంచ రాజకీయ, కార్పొరేట్, మీడియా రంగాల్లోని పెద్ద పెద్ద తలకాయల మధ్య నేరస్త సంబంధాలు ఎలా పెనవెసుకు పోయాయో చెప్పడమే కాదు, పెట్టుబడిదారీ సామ్రాజ్యంలో నీతి నియమాలు అనేవి ప్రజలకు చెప్పడానికే కాని పెట్టుబడి మూటలమీద కూర్చున్న వాళ్లు ఆచరించడానికి కాదని లోకానికి వెల్లడించాయి. ఈ దుర్మార్గుడు తన అనుచరులతో కలిసి సృష్టించిన నేర సామ్రాజ్యంలో కనిపించిన పేర్లు చూస్తే మనకు మతి పోతుంది. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ రాజు ఆండ్రూ దగ్గరినుండి ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంలో దిగ్గజాలైన బిల్ గేట్స్, ఎలన్ మన్స్, జెఫ్ బెజోస్ వరకు వందల మంది... బాలికలపై లైంగిక అత్యాచారాలు,.........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?