Logili Books

Sociology

Prapamcheekarana Veechikalu

By Janga Manoharao

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Prapamcheekarana Veechikalu
Publisher
Emasco Books pvt.L.td.
ISBN
MANIMN7036
Binding
Paparback
Published Date
June, 2026
Number Of Pages
199
Language
Telugu
Availability
In Stock
About this book

సామాజిక నేపథ్యంతో పరిచయం చేసిన విజ్ఞానశాస్త్రం

పారిశ్రామిక విప్లవ కాలంలో అనేక కొత్త యంత్రాలు కనుగొన్న ఫలితంగా, పెట్టుబడిదారీ ఉత్పత్తులు భారీ ఎత్తున పెరిగాయి. ఇట్టి మహత్కార్యాన్ని సాధించటంతో శాస్త్రవిజ్ఞానం స్థాయి కూడా పెరిగిపోయింది. భూస్వామ్య వ్యవస్థను నిర్మూలించి పెట్టుబడిదారీ విధానాన్ని పటిష్టం చేయటానికి శాస్త్రవిజ్ఞానం అద్భుతమైన సాధనంగా పాలకవర్గాలకు కనిపించింది. అయితే, ఉత్పత్తుల పెరుగుదల మాట అట్లా ఉంచి, ఈ వర్గాలు శాస్త్రవిజ్ఞానాన్ని తమ స్వార్థానికి ఎట్లా దుర్వినియోగపరచగలవో, దాని దుష్ఫలితాలు ఏమిటో, రెండవ ప్రపంచ యుద్ధం రుజువు చేసింది. ఆ దరిమిలా ప్రపంచవ్యాప్తంగా సాగిన చర్చోపచర్చలలో - శాస్త్రవిజ్ఞాన మూలసూత్రాలను, వాటి సత్ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలనూ సామాన్య ప్రజలకు అర్థమయే రీతిలో శాంతికాముకులు, మానవతావాదులు వివరించారు. ఈ వివరణ అటు పెట్టుబడిదారీ దృక్పథం నుండి, ఇటు సామ్యవాద అవగాహన నుండి కూడా సాగింది. అట్టి కృషిని తెలుగుదేశంలో సామ్యవాద దృక్కోణం నుండి జరిపిన వ్యక్తి కొడవటిగంటి కుటుంబరావు. ప్రకృతి, జీవజాలం, గ్రహాలు, మానవుని ఉనికి, పరిణామం, శాస్త్ర పరిశోధనలు, యంత్రాలు, అణుశక్తి, పెట్టుబడిదారీ వ్యవస్థలో, సామ్యవాద వ్యవస్థలో శాస్త్ర విజ్ఞానం వినియోగమవుతున్న తీరు, అందువల్ల కలుగుతున్న ఫలితాలు మొదలైన అంశాలపై ఆయన సరళమైన భాషలో విరివిగా వ్యాసాలు, పుస్తకాలు స్వయంగా రాయటం, అనువదించటం చేశారు.

కుటుంబరావు తన రచనల కోసం ఎంచుకున్న అంశాల వలన, తరచు ఇచ్చే నిర్వచనాలు, చేసే వ్యాఖ్యల వలన - ఆయన గతితార్కిక భౌతికవాద వైఖరి విస్పష్టంగా కనిపిస్తుంది. ప్రకృతిలో కనిపించే అనేకత్వంలో ఏకత్వాన్ని కనుగొనటమే శాస్త్ర విజ్ఞాన లక్ష్యమని కుటుంబరావు గుర్తించాడు. ఆధ్యాత్మిక జ్ఞానమే జ్ఞానమంటూ మత విశ్వాసాల కోసమో, ఆచారాల కోసమో అమానుషంగా ప్రవర్తించటమే జ్ఞానమని నమ్మేవారిని................................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?