పరిచయం
హైదరాబాద్ రాష్ట్రం పరిపాలన రీత్యా, నాల్గు సుబాలుగా విభజించబడగా, వీటిలో గుల్షనాబాద్ మెదక్ సుబా' ఒకటిగా, ఇంకా మిగతా వాటి కంటే పెద్దదిగా ఏర్పడింది. 1905లో ఈ రాష్ట్రంలో జిల్లాబంది, లేక జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. దీని ప్రకారం, మెదక్ సుబాలో మెదక్, నిజామాబాద్, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలు భాగమైనాయి. ఈ నాల్గు జిల్లాల్లోని ప్రజలు ప్రధానంగా తెలుగు భాషను మాట్లాడేవారు. ఇవి తెలంగాణ ప్రాంతంలో భాగంగా ఉన్నాయి. హైదరాబాద్ రాష్ట్రం మొత్తం, తెలంగాణ, మరట్వాడా అనే రెండు సహజసిద్ధ ప్రాంతాలు"గా విభజించబడింది. భౌగోళికంగా, మెదక్ సుబా నాల్గు జిల్లాలు, ఉత్తరంగా 18°5' మరియు 19°30′ నుండి 16°2 మరియు 17°14'; తూర్పున 77°40' మరియు 79° నుండి 78°45' మరియు 79°55′ల మధ్య నెలకొని ఉన్నాయి. ఈ సుబాకు తూర్పున వరంగల్ సుబా జిల్లాలైన వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు; పడమర గుల్బర్గా సుబాకు చెందిన బీదర్, గుల్బర్గా, రాయచూర్ జిల్లాలు; ఉత్తరాన ఔరంగాబాద్ సుబాకు చెందిన నాందేడ్ జిల్లా, వరంగల్ సుబాకు చెందిన ఆదిలాబాద్ జిల్లా; దక్షిణాన బ్రిటీష్ వలస పాలనలో ఉన్న మదరాస్ ప్రెసిడెన్సీకి చెందిన కర్నూలు, గుంటూరు జిల్లాలను ఈ ప్రాంతాన్నుండి వేరు చేస్తూన్న కృష్ణా నది, ఎల్లలుగా ఉన్నాయి.
1.1: ఈ ప్రాంత గత చారిత్రక ప్రాముఖ్యత
లభ్యమౌతున్న చారిత్రకాధారాలననుసరించి, ప్రాచీన, మధ్య యుగాల్లో, మెదక్ 11 సుబా ప్రాంతం, వరుసగా ఆంధ్ర శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, వాకాటకులు, వేంగి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కల్యాణి చాళుక్యులు, వరంగల్ కాకతీయులు, ఖిల్జీలు, తుగ్లక్లు, బహమనీయులు, మొగల్ల పరిపాలనలో ఉండింది'. ఆసక్తికర, ప్రాముఖ్యతా విషయమేమంటే, కాకతీయుల వరకు గల రాజ వంశాలు ఈ ప్రాంతం
హైదరాబాద్ రాష్ట్ర (మెదక్ సుబా) సామాజికార్థికాభివృద్ధి...........................